మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేట్లు మండిపోతున్న ఈ కాలంతో రూ.99కే సినిమా చూడోచ్చు అంటే ఎవరు కాదంటారు. ప్రముఖ మల్టిప్లెక్స్ సంస్థ పీవీఆర్.. సినీ లవర్స్ కోసం ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెంటర్ ఏదైనా, సినిమా ఏదైనా ఇదే రేటుకు చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఒక్క కేవలం ఒక్కరోజుకే వర్తిస్తుందని అనౌన్స్ చేసింది.
జనవరి 20న 'సినిమా లవర్స్ డే' సందర్భంగా ఈ క్రేజీ ఆఫర్‌ను అమలులోకి తీసుకురానుంది. అయితే అన్ని నగరాల్లో ఇదే ఉంటుందని గ్యారంటీ లేదు. చంఢీగఢ్, పుదుచ్చెరి, పఠాన్‌కోట్‌లాంటి నగరాలకు ఈ ఆఫర్ వర్తించదు. మరోవైపు ఆంధ్ర కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.100+జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రూ.112+జీఎస్టీకి టికెట్ అందుబాటులో ఉంటుందట. ప్రీమియం కేటగిరి సీట్స్ (రెక్లెయినర్, ఐమ్యాక్స్, 4డీఎక్స్ తదితర సమాన స్థాయిలు కలిగిన సీట్లు) ఈ ఆఫర్ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఇక జనవరి 20న ఇతర ఏ ఆఫర్లు వర్తించవని మరిన్ని వివరాలకు పీవీఆర్ సినిమాస్ వెబ్‌సైట్‌లో చూడొచ్చని సంస్థ తెలిపింది. కాగా 2022 సెప్టెంబర్ 16న ఇదే తరహా ఆఫర్‌తో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. 'నేషనల్ సినిమా డే' సందర్భంగా దేశవ్యాప్తంగా కేవలం రూ.75కే టికెట్లను విక్రయించింది.