ETV Bharat / entertainment

తెలుగు తెరపైకి పునీత్‌ కొత్త చిత్రం.. ట్రైలర్‌ సూపర్​ - పునీత్ రాజ్​కుమార్​ కొత్త సినిమా

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన 'చక్రవ్యూహ' గతంలో విడుదలై సంచలనం సృష్టించింది. 100 రోజులకుపైగా ప్రదర్శితమైంది. అయితే ఇప్పుడా సినిమాను తెలుగులో రిలీజ్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్​. ఈ సందర్భంగా తాజాగా తెలుగు ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

puneeth Rajkumar civil engineer trailer
పునీత్‌ రాజ్​కుమార్​ సివిల్ ఇంజనీర్​
author img

By

Published : Oct 25, 2022, 6:34 AM IST

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన మునుపటి చిత్రాలు యువరత్న, జేమ్స్​.. కన్నడ, తెలుగు రెండింటిలోనూ విడుదలై... ప్రేక్షకుల ఆదరణను దక్కించుకున్నాయి. దీంతో ఆయన గత చిత్రాలను తెలుగులో విడుదల చేసే పనిలో పడ్డారు తెలుగు నిర్మాతలు. తాజాగా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన 'చక్రవ్యూహ'ను ఇప్పుడు 'సివిల్ ఇంజినీర్'గా తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది.

చందన ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ట్రైలర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది. ఎం. శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ 2016లో విడుదలై సంచలనం సృష్టించింది. 100 రోజులకుపైగా ప్రదర్శితమైంది. పునీత్‌ ఇందులో లోహిత్‌ అనే పాత్రలో కనిపిస్తారు. రచితా రామ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అరుణ్‌ విజయ్‌, అభిమన్యు సింగ్‌, భవ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఇక ఆయన నటించిన ఆఖరి చిత్రం 'గంధదగుడి' ఈ నెల 28న విడుదల కానుంది.

కాగా, పునీత్​.. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బెట్టడా హువు' చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. 'వసంత గీత', 'భాగ్యవంత', 'ఏడు నక్షత్రాలు', 'భక్త ప్రహ్లాద', 'యరివాను' వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి. కాగా, గుండెపోటుతో పునీత్‌ గతేడాది అకాల మరణం చెందారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మళ్లీ పట్టాలెక్కనున్న పూరీ జగన్నాథ్ కలల ప్రాజెక్ట్.. ఈసారి బాలీవుడ్​లో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.