ETV Bharat / entertainment

ప్రభాస్​ బర్త్​డే స్పెషల్​.. మూవీ టీమ్స్​ నుంచి రెండు సర్‌ప్రైజ్‌​లు - adipurush prabhas movie

ప్రభాస్​ బర్త్​డే సందర్భంగా తన అప్​కమింగ్​ మూవీ అప్డేట్స్​ విడుదలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఆ అప్డేట్స్​ మీ కోసం...

prabhas upcoming movies posters
prabhas birthday special
author img

By

Published : Oct 23, 2022, 4:01 PM IST

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వైజయంతి మూవీస్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఆదివారం ప్రభాస్‌ పుట్టినరోజు. దీంతో శనివారం అర్ధరాత్రి 'ప్రాజెక్ట్‌ కె' సెట్‌లో ప్రభాస్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. టీమ్‌ సభ్యులు సెట్‌లో భారీగా టపాసులు కాల్చారు. తమ హీరోకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ట్విట్టర్​లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

'ప్రాజెక్ట్​ కె' పోస్టర్​ వచ్చేసిందోచ్​..
మూవీ టీమ్​ మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'ప్రాజెక్ట్​ కె' మూవీ నుంచి ఓ పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ చేయి.. సూపర్‌ హీరో చేయిలా కనిపించింది. "హీరోలు పుట్టరు. ఉద్భవిస్తారు" అన్న క్యాప్షన్​తో విడుదలైన ఈ పోస్టర్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సూపర్‌హీరో మూవీగా 'ప్రాజెక్ట్‌ కె' తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన అయిదు యాక్షన్‌ బ్లాకులు ఉన్నట్లు సమాచారం.
మునుపెన్నడు చూడని భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌గా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు.

ఆదిపురుషుడు అవతరించాడు..
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్​తో పాటు సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హిందూ పురాణ రామాయణం ఆధారంగా రూపొందించారు. వచ్చే ఏడాది జనవరి 12న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్​ బర్త్​డే సర్​ప్రైజ్​గా మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు.
"మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీ రామ్. #ఆదిపురుష్ జనవరి 12, 2023న ఐమ్యాక్స్​తో పాటు త్రీడీ థియేటర్‌లలో విడుదలవుతుంది!" అనే క్యాప్షన్ పోస్టర్‌లో ఉంది. ఈ పోస్టర్​ను ప్రభాస్​తో పాటు ఓం రౌత్​ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

ఇదీ చదవండి:Prabhas: ఆ సినిమా స్ఫూర్తితోనే హీరోగా.. అందుకే నటనవైపు

ప్రభాస్​ బాహుబలి కన్నా ముందే నటించిన తొలి హిందీ సినిమా తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.