ETV Bharat / entertainment

పెళ్లి అక్కడే చేసుకుంటాను.. ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను : ప్రభాస్​ - పెళ్లిపై మాట్లాడిన ప్రభాస్​

Adipurush prerelease event : 'ఆదిపురుష్​' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పెళ్లి గురించి మాట్లాడారు ప్రభాస్(Prabhas Marriage)​. ఎక్కడ చేసుకుంటారో తెలిపారు. ఆ వివరాలు..

Prabhas Adipurush
పెళ్లి అక్కడే చేసుకుంటాను.. ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను : ప్రభాస్​
author img

By

Published : Jun 7, 2023, 6:37 AM IST

Updated : Jun 7, 2023, 11:45 AM IST

Prabhas Marriage : టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు పాన్ ఇండియా స్టార్​ ప్ర‌భాస్‌. ఆయన పెళ్లి గురించి ఎన్ని వార్త‌లు, ఇంకెన్ని పుకార్లు వస్తుంటాయి. అప్పటికే పలు సందర్భాల్లో దానిపై స్పందించిన ఆయన.. కొంతకాలం నుంచి ఈ విషయంపై చాలా సైలెంట్​గా ఉన్నారు. ఆ మధ్యలో ప్రభాస్​.. ఆదిపురష్ సినిమా హీరోయిన్ కృతిసనన్​తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం కూడా సాగింది. కానీ అది అవాస్తమని ఆ తర్వాత తెలిసింది. అయితే ఎట్టకేలకు తన పెళ్లి గురించి ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో మాట్లాడారు ప్రభాస్​. త‌న అభిమానులకు కాస్త హింట్ ఇచ్చారు. పెళ్లంటూ చేసుకొంటే.. తిరుప‌తిలోనే చేసుకుంటా అని తెలిపారు.

Adipurush pre release event : "ఏడు నెలల క్రితం నా అభిమానులకు త్రీడీలో టీజర్‌ను చూపించాలని దర్శకుడిని అడిగాను. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ టీమ్​ ముందుకు సాగింది. ట్రైలర్‌ను కూడా మళ్లీ ఫ్యాన్స్​కు చూపించాలని కోరాను. వాళ్లే నా బలం. ఈ మూవీ కోసం డైరెక్టర్​, ప్రొడ్యూసర్స్​, టెక్నికల్​ టీమ్​ ఎనిమిది నెలల పాటు యుద్ధం చేసింది. ఒక్కొక్కరు రోజుకి 20 గంటల పాటు శ్రమించారు. ఇది సినిమా కాదు.. మా అదృష్టం. మెగాస్టార్​ చిరంజీవి సర్‌ను కలిసినప్పుడు 'రామాయణం చేస్తున్నావా?' అని అడిగారు. అవుననగానే 'అది అందరికీ దొరికే అవకాశం కాదు, నీకు దొరికింది. నిజంగా నీ అదృష్టం' అన్నారు. ఇలాంటి చిత్రం తెరకెక్కించేటప్పుడు కష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఈ మూవీకీ ఫస్ట్​ నుంచి కష్టాలొచ్చాయి. ఓం రాక్‌స్టార్‌లా కష్టపడ్డారు. 20 ఏళ్ల కాలంలో ఇంత కష్టపడిన డైరెక్టర్​ మరొకరిని నేను చూడలేదు. చినజీయర్‌ స్వామి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన రాకతో ఈ ఈవెంట్​కు మంచి ప్రాధాన్యత వచ్చింది. నిర్మాత భూషణ్‌కు ఈ సినిమా ఓ ఎమోషనల్​. ఏ సినిమాకీ కష్టపడనంతగా కష్టపడ్డారు. జానకి పాత్రలో కళ్లల్లో నీళ్లు పెట్టుకున్న ఒక్క పోస్టర్‌తోనే.. కృతిసనన్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచిగా పేరున్న, మంచి అమ్మాయే హీరోయిన్​గా కావాలని కృతిని సెలెక్ట్ చేసుకున్నాం. హనుమంతుడు, లక్ష్మణుడగా కనిపించిన దేవ్‌దత్‌, సన్నీలతో కలిసి నటిస్తున్నప్పుడు తెలియని ఓ కొత్త ఎమోషనల్​గా ఫీలయ్యాను. ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తాను. ఒక్క ఏడాదిలో రెండు నుంచి మూడు సినిమాలు కూడా రావొచ్చు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తాను" అని ప్రభాస్​ అన్నారు. ఇక పెళ్లి గురించి అభిమానులు అడగగా... "ఎప్పుడైనా తిరుపతిలోనే చేసుకుంటాను" అని సమాధానమిచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

ADIPURUSH TRAILER : 'ఆదిపురుష్‌'.. ఓ భావోద్వేగం.. యాక్షన్​ ట్రైలర్​ వచ్చేసిందోచ్​..

Prabhas Adipurush : పంచెకట్టులో ప్రభాస్.. శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్​ 'రాఘవుడు' !

Last Updated : Jun 7, 2023, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.