ETV Bharat / entertainment

'ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?' - PRABHAS SITARAMAM SPEECH

PRABHAS SITARAMAM: సినిమా రంగానికి థియేటరే గుడి అని, అది ప్రేక్షకులు ఇచ్చిందేనని డార్లింగ్ ప్రభాస్ అంటున్నారు. సీతారామం ముందస్తు విడుదల వేడుకలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమాను అందరూ థియేటర్లలోనే చూడాలని కోరారు.

PRABHAS SITARAMAM
PRABHAS SITARAMAM
author img

By

Published : Aug 4, 2022, 6:46 AM IST

PRABHAS SITARAMAM EVENT: "కొన్ని చిత్రాలను థియేటర్లోనే చూడాలి. 'సీతారామం' థియేటర్లోనే చూడాల్సిన సినిమా" అన్నారు ప్రముఖ కథానాయకుడు ప్రభాస్‌. ఆయన ముఖ్య అతిథిగా బుధవారం హైదరాబాద్‌లో 'సీతారామం' ముందస్తు విడుదల వేడుక జరిగింది. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్‌ నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

PRABHAS SITARAMAM
.

PRABHAS SITARAMAM SPEECH: ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో తొలి టికెట్‌ని కొన్న అనంతరం ప్రభాస్‌ మాట్లాడుతూ "మా సినిమా రంగానికి థియేటరే గుడి. ఆ గుడి ప్రేక్షకులు ఇచ్చిందే. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? గొప్ప నటులు, సాంకేతిక బృందం కలిసి చేసిన ఈ సినిమాని అందరం థియేటర్లలోనే చూద్దాం. దేశంలో ఉన్న హ్యాండ్సమ్‌ హీరో, స్టార్‌ దుల్కర్‌. అందరూ దుల్కర్, మృణాల్‌ నటన గురించి చెబుతున్నారు. చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఇందులో ప్రేమకథే కాదు, యుద్ధంతోపాటు ఇతర అంశాలూ ఉన్నాయని చెప్పారు నాగ్‌ అశ్విన్‌. రష్యాలో చిత్రీకరించిన తెలుగు సినిమా ఇదేనేమో నాకు తెలిసి. దర్శకుడు హను రాఘవపూడి సినిమాలు చూశా. కవితాత్మకంగా తీస్తుంటారు. ఇందులో సుమంత్‌ చేశారంటే ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వినీదత్‌ తెలుగు పరిశ్రమలో ఉండటం గొప్ప విషయం" అన్నారు.

PRABHAS SITARAMAM
..
PRABHAS SITARAMAM
.
PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్

స్వప్నదత్‌ మాట్లాడుతూ "ప్రభాస్‌ బయటికి రారు. మాకోసం, సినిమాని బతికించేందుకోసం ఈ వేడుకకి వచ్చారు. నటులంతా గుర్తుండిపోయే పాత్రల్ని పోషించారు. ఇలాంటి సినిమాలు తీద్దామన్నప్పుడు వాణిజ్యాంశాల గురించి ఆలోచించకుండా వెన్నుదన్నుగా నిలవడం మామూలు విషయం కాదు. మా నాన్నవల్లే ఈ సినిమా చేశాం" అన్నారు.

PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్
PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్

నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ "నేనూ, ప్రియాంక 'ప్రాజెక్ట్‌ కె'లో నిమగ్నం కాగా, స్వప్న ఒక్కటే దీన్ని పూర్తి చేశారు. 170 రోజులు చిత్రీకరణ చేశారు. 'ఓ సీత కథ'తో పరిశ్రమలోకి వచ్చిన నేను ఎప్పటికైనా ఒక మంచి ప్రేమకథ తీయాలనుకునేవాణ్ని. అది ఈ సినిమా రూపంలో జరిగింది" అన్నారు.

PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్
PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ "నన్ను నేను సంస్కరించుకోవడానికి ఈ చిత్రం ఎంతో ఉపయోగపడింది. సినిమా మేకింగ్‌లో ఉన్న వాళ్ల వల్ల చాలా ఎదిగాను, ఒక మెట్టు ఎక్కాను. అది విడుదల రోజు అంతా చూస్తారు. స్వప్నదత్‌ ఇచ్చిన సహకారం గొప్పది. ఈ చిత్రం చూశాక మనసుకు నచ్చిన బంధువులతో కలిసి రెండున్నర గంటలు గడిపినట్టుగా ఉంటుంది. ఒక వ్యసనంలా ఉంటుందీ చిత్రం. మళ్లీ మళ్లీ థియేటర్‌కి వచ్చి చూస్తార"న్నారు.

నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ "ప్రేమకథల్ని మించిన వాణిజ్యాంశం మరొకటి ఉండదు. ఈ సినిమాలోని పాటల్ని, సన్నివేశాల్ని చూశాక హను రాఘవపూడి ఎంత బాగా తీశాడనే ఈర్ష్య కలిగింది" అన్నారు. సుమంత్‌ మాట్లాడుతూ "మరికొన్ని రోజుల్లో దృశ్యకావ్యం లాంటి సినిమా చూడబోతున్నారు ప్రేక్షకులు. నా పాత్ర ట్రైలర్‌లో కొంచెమే చూపించారు. వెండితెరపై చూసి ఆశ్చర్యపోతార"న్నారు.

PRABHAS SITARAMAM
సీతారామం వేడుకలో ప్రభాస్

మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ "సీత పాత్రకి న్యాయం చేశానని నమ్ముతున్నా. ఈ పాత్రని చాలా బాధ్యతగా చేశా. థియేటర్‌లో కూర్చుంటే రామ్, సీత ప్రపంచంలోకి వెళ్లిపోతారంతా. కథలుంటాయి, ప్రేమకథలుంటాయి. వాటిని మించిందీ చిత్రం" అన్నారు.

PRABHAS SITARAMAM
.

దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ "ఈ సినిమా ప్రయాణం చేస్తూ అదృష్టవశాత్తూ 'ప్రాజెక్ట్‌ కె' సెట్లోకి తొంగి చూసే అవకాశం దొరికింది. కచ్చితంగా భారతీయ సినిమాని మార్చే చిత్రం అవుతుంది. ఆసక్తికరమైన ఓ మంచి పుస్తకంలా ఉంటుందీ 'సీతారామం'' అన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్‌ భాస్కర్, అనుదీప్‌తోపాటు చిత్రబృందం పాల్గొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.