ETV Bharat / entertainment

Prabhas Nayanthara : 16ఏళ్ల తర్వాత ప్రభాస్​-నయన్​ జంటగా!.. ఏ సినిమాలో అంటే? - ప్రభాస్ నయనతార 16ఏళ్ల తర్వాత

Prabhas Nayanthara : దాదాపు 16ఏళ్ల తర్వాత ప్రభాస్-నయనతార కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా వివరాలు..

Prabhas Nayanthara : 16ఏళ్ల తర్వాత ప్రభాస్​-నయన్​ జంటగా!.. ఏ సినిమాలో అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 12:36 PM IST

Updated : Sep 23, 2023, 1:02 PM IST

Prabhas Nayanthara : తెలుగు చిత్రసీమలో ప్రభాస్​-అనుష్క జోడీ ఎంత అందంగా అయితే ఉంటుందో ఆ తర్వాత ప్రభాస్-నయనతార జోడీకూడా అంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. గతంలో ప్రభాస్-నయనతార కాంబో.. యోగి చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగానే ఉంది. అయితే ఈ జంట మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Prabash Kannappa : వివరాళ్లోకి వెళితే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​ 'కన్నప్ప' రీసెంట్​గా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ పాన్‌ ఇండియా సినిమాను మోహన్‌బాబు, విష్ణు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్​ అతిథి పాత్రలో మెరవనున్నారని, అది కూడా శివుడి పాత్రలో కనిపించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్​తో దీన్ని కన్ఫామ్ చేశారు.

అయితే ఇప్పుడిదే చిత్రంలో నయనతార నటించనుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా పార్వతిగా కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్-నయనతార​.. యోగి సినిమా తర్వాత అంటే దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి నటించినట్టవుతుంది. ఇకపోతే నయన్​.. ఇప్పటికే పలు చిత్రాల్లో అమ్మవారిగా కనిపించి బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే కన్నప్ప చిత్రం.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించనున్నారు. చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు ఆ మధ్య అనౌన్స్ చేశారు మేకర్స్​. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందించనున్నారు. ఫారెన్​లో ఈ మూవీ షూటింగ్ జరగనుంది.

కాగా, ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీని తర్వాత ప్రాజెక్ట్​ కె కల్కి, స్పిరిట్​, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాతో పలకరించనున్నారు. ఇక నయన్​ రీసెంట్​గా షారుక్ ఖాన్​ తో కలిసి జవాన్​ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ హిట్​ను అందుకుంది.

Jawan Shahrukh : 'జవాన్' విషయంలో నయన్​ అప్సెట్​.. ఇక హిందీ చిత్రాలు బంద్​!.. అసలేం జరిగిందంటే?

Kalki Movie Photo Leaked : 'కల్కి' టీమ్​ లీగల్ యాక్షన్​.. ఇకపై అలా చేస్తే మీ పని అయిపోయినట్టే

Last Updated : Sep 23, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.