ETV Bharat / entertainment

సమ్మర్ హీట్‌ పెంచేందుకు.. 'జిగేల్‌' రాణులు వచ్చేస్తున్నారు! - heroine special songs

Heroines in Special songs upcoming movies: స్టార్​ హీరోయిన్లుగా మంచి ఫామ్​లో ఉండగానే.. వేరే సినిమాల్లోని ప్రత్యేక గీతాల్లో కాలు కదిపేస్తున్నారు మన కథానాయికలు. అలా అభిమానుల్ని మరింతగా ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వేసవిలో హీట్​ పెంచేందుకు సిద్ధమైన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా?

Upcoming special songs in movies
Upcoming special songs in movies
author img

By

Published : Apr 19, 2022, 3:16 PM IST

పూజాహెగ్డే.. కథానాయికగా మంచి ఫామ్‌లో ఉండగానే 'జిగేలు రాణి'(రంగస్థలం) అనే ప్రత్యేక గీతంలో నర్తించి వావ్ అనిపించుకుంది. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకెళ్తూనే స్పెషల్‌ సాంగ్‌కు కాలు కదిపింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అలా పూజాతోపాటు ఈ వేసవిలో హీట్‌ పెంచబోతున్న వారెవరంటే?

F3 movie Poojahegdey: స్పెషల్‌ ఫన్‌.. అందరి 'ఫ్రస్టేషన్‌' పోగొట్టేందుకు, 'ఎఫ్‌ 2'కు మించిన 'ఫన్‌' పంచేందుకు 'ఎఫ్‌ 3' సినిమాతో రాబోతున్నారు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు కాగా సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ముగ్గురితోపాటు పూజాహెగ్డే అందం 'ప్రత్యేకం'గా నిలువనుంది. ఈ చిత్రంలోనే ఆమె ఓ పార్టీ సాంగ్‌లో కనిపించనుంది. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి పబ్‌ నేపథ్యంలో సాగే పాట అనిపిస్తుంది. మరి ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. 'ఎఫ్‌ 3'.. గతంలో విజయవంతమైన 'ఎఫ్‌ 2'కు సీక్వెల్‌.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

Acharya Regina: రెజీనాతో సానా కష్టం.. ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా రూపొందిన 'ఆచార్య' చిత్రంలో 'సానా కష్టం' అనే పాటతో సందడి చేయనుంది రెజీనా. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందింది. చిరు వేగానికి తగ్గట్టు రెజీనా ఓ రేంజ్‌లో డ్యాన్స్‌ చేసినట్టు లిరికల్‌ వీడియో చూస్తే అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Uravasi Rautela Black rose movie: ఊర్వశి తప్పేముంది.. బాలీవుడ్‌ భామ ఊర్వశి రౌతేలాకు ప్రత్యేక గీతాలు కొత్తేమీ కాదు. హిందీ, బెంగాలీ చిత్రాల్లోని ఐటెం పాటలకు నర్తించిన ఈమె 'బ్లాక్‌ రోజ్‌' సినిమాలో 'నా తప్పు ఏమున్నదబ్బా' అనే గీతంతో శ్రోతల్ని ఉర్రూతలూగించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాట శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. మోహన్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలకావాల్సింది. కానీ, అనివార్య కారణంగా వాయిదా పడింది. త్వరలోనే విడుదలకానుంది.

Raviteja Anveshi Jain: రవితేజ పక్కన?.. ప్రభుత్వ అధికారిగా రవితేజ నటిస్తున్న చిత్రం 'రామారావు ఆన్‌ డ్యూటీ'. శరత్‌ మండవ దర్శకుడు. ఇందులోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం బాలీవుడ్‌ భామ అన్వేషి జైన్‌ను ఎంపిక చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్‌ 17న రానుంది.

ఇదీ చూడండి: ప్రభాస్​ 'సలార్​' లుక్ లీక్​.. 'ఆచార్య'లో కాజల్​ సీన్స్​కు కత్తెర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.