యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌తో నటి పూజా కుమార్ డేటింగ్లో ఉన్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ రూమర్స్‌ను మరోసారి పూజా ఖండించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆమె స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. "కమల్ హాసన్‌తో నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాకు బాగా క్లోజ్ అయ్యారు. అందుకే ఈ రూమర్స్ వస్తున్నాయి. మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించొద్దు" అని ఆమె చెప్పినట్లు ఆ కథనాల్లో ఉంది.
కాగా, కమల్-పూజా కలిసి 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్', 'విశ్వరూపం 2'లో నటించారు. ఇక ఈ సినిమాల్లో వీరిద్దరి రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే పూజా కుమార్.. కమల్‌తోనే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతోనూ స్నేహంగా ఉంటున్నారు. కమల్ ఫ్యామిలీ వేడుకల్లో పూజా కుమార్ కూడా పలుమార్లు కనిపించారు. ఇక కమల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం తన కొత్త చిత్రాలను లైన్లో పెట్టే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఇండియన్ 2' (తెలుగులో భారతీయుడు 2) షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి: అల్లు అర్జున్ తర్వాతే విజయ్ ఈ ఏడాది టాప్ 10 ట్రెండింగ్ సాంగ్స్ ఇవే