Ponniyan Selvan song: టీజర్‌తోనే తన సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూపించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-1'. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులోని ఓ పాట కోసం పది, ఇరవై కాదు ఏకంగా 300 మంది డ్యాన్సర్లను తీసుకున్నారట. ఇందులో 100మంది ముంబయికి చెందిన డ్యాన్సర్లు ఉన్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. 'ఈ పాట షూటింగ్‌కు 25 రోజులు పట్టింది. ఇందుకోసం ఆరేడు షెడ్యూల్స్ చేయాల్సి వచ్చింది. భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు ఎవరూ చూడని స్థాయిలో ఈ పాట ఉంటుంది' అని చిత్ర బృందానికి చెందిన కొందరు తెలిపారు.
దాదాపు రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకొంటున్న ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'పొన్నియిన్ సెల్వన్' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'సుల్తాన్లు, బాద్షాలే బాలీవుడ్‌ను ముంచుతున్నారు'.. షారుక్, సల్మాన్‌పై ఘాటు వ్యాఖ్యలు!