ETV Bharat / entertainment

వారంతా సెట్.. నేనొక్కడినే ఇలా.. హిట్ కొట్టగానే...: హీరో ప్రిన్స్​ - హీరో ప్రిన్స్​ పెళ్లికూతురు పార్టీ రిలీజ్ డేట్​

Hero Prince Pellikuturu party movie: సోలోగా సినిమాలు తక్కువ చేయడంపై వివరణ ఇచ్చాడు యువహీరో ప్రిన్స్​. సినిమాల ఎంపిక విషయంలో తాను ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదన్నాడు. తన స్నేహితులందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని, ఇక తానే బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని, కమర్షియల్ హిట్ కొట్టాకే ఆ పార్టీ ఇస్తానని ప్రిన్స్ వెల్లడించాడు.

Hero  Prince
హీరో ప్రిన్స్​ పెళ్లికూతురు పార్టీ మూవీ
author img

By

Published : Jun 19, 2022, 2:52 PM IST

హీరో ప్రిన్స్​

Hero Prince New Movie: సినిమాల ఎంపిక విషయంలో తాను ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదన్నాడు యువ హీరో ప్రిన్స్. మంచి పాత్రలు వస్తే తప్పకుండా ఏ సినిమాలోనైనా భాగస్వామ్యం అవుతానని స్పష్టం చేశాడు. ఇటీవల 'డీజే టిల్లు'లో ప్రతినాయకుడిగా నటించడం అందుకు ఉదాహరణని తెలిపాడు. ఇంకా మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు.

తనపై పడిన ప్లేబాయ్ ముద్రను చెరిపేసేందుకు మంచి కథలు వింటున్నానంటోన్న ప్రిన్స్.. తన తాజా చిత్రం 'పెళ్లికూతురు పార్టీ' విడుదల సందర్భంగా ఈటీవీ భారత్​తో మాట్లాడాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ సినిమా అని చెప్పాడు. తన స్నేహితులందరి పెళ్లిళ్లు అయిపోయానని, ఇక తానే బ్యాచిలర్ పార్టీ ఇవ్వాలని, కమర్షియల్ హిట్ కొట్టాకే ఆ పార్టీ ఇస్తానని ప్రిన్స్ వెల్లడించాడు. అగ్రహీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానంటోన్న ప్రిన్స్.. వారానికి రెండు సార్లు తనకు ఇష్టమైన క్రికెట్ ఆడతానని తెలిపాడు.

ఇదీ చూడండి: 'విరాటపర్వం.. ఆ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.