ETV Bharat / entertainment

Mangalavaaram Movie : 'గణ గణ మోగాలిరా'.. పాయల్ రాజ్​పుత్​ పవర్​ఫుల్​ సాంగ్​​​.. వింటే పూనకాలే - boys hostel protest song release

Payal Rajput Mangalavaaram Movie Song : బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్​పుత్​ నటించిన 'మంగళవారం' సినిమా నుంచి ఓ పవర్​ఫుల్ సాంగ్ రిలీజైంది. జాతర నేపథ్యంలో సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మీరు చూసేయండి..

Payal Rajput Mangalavaaram Movie Song
Payal Rajput Mangalavaaram Movie Song
author img

By

Published : Aug 16, 2023, 7:27 PM IST

Updated : Aug 16, 2023, 7:39 PM IST

Payal Rajput Mangalavaaram Movie Song : రొమాంటిక్ లవ్ స్టోరీ 'RX 100'తో యూత్ ఆడియెన్స్​ను మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి ఆ తర్వాత యాక్షన్ అండ్ ఎమోషన్​ మూవీ 'మహా సముద్రం'తో ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. కానీ అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్న ఆయన.. ఈ సారి హారర్ థ్రిల్లర్ జానర్​తో రానున్నారు. తనకు తొలి సక్సెస్​ను అందించిన 'RX 100' బ్యూటీ పాయల్​ రాజ్​పుత్​తోనే ఈ సినిమా చేశారు.

ఇప్పటికే విడుదలై ఈ సినిమా టీజర్​ మంచి ఉత్కంఠకు గురి చేసింది. తాజాగా 'గణ గణ మోగాలిరా'(Ganagana Mogalira song) అనే లిరికల్ వీడియో సాంగును రిలీజ్​ చేశారు మేకర్స్​. 'అమ్మా హారతి అందుకో .. మమ్ము ఆదుకో, పూజలందుకో .. పుణ్యమిచ్చుకో..' అంటూ సాగిన ఈ పాట.. అమ్మవారి జాతర నేపథ్యంలో ఎంతో పవర్​ఫుల్​గా సాగింది. ఈ సాంగ్​కు అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతం హైలైట్​గా నిలిచింది. దీనికి లిరిక్స్​ భాస్కర భట్ల అందించారు. మహాలింగం ఆలపించారు. అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అజనీశ్ లోక్​నాథ్ - భాస్కర భట్ల కాంబోలోనే.. మరో పది రోజుల్లో.. కన్నడలో సెన్సేషనల్​​ హిట్ 'హాస్టల్‌ 'హుడుగురు బేకాగిద్దరే'(hudugaru bekagiddare release date) సినిమా ఇక్కడ 'బాయ్స్‌ హాస్టల్‌' పేరుతో రానుంది. ఈ క్రమంలోనే.. ఈ సినిమా నుంచి 'ప్రొటెస్ట్' అనే సాంగ్​ను రిలీజ్ చేశారు మేకర్స్(boys hostel protest song release). ఈ సాంగ్​కు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. అజనీశ్ లోక్​నాథ్ మ్యూజిక్ అందించారు. ఈ పాట​ ఆద్యంతం లిరిక్స్​, బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​, అందులోని సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. 'ఫిజిక్స్​ పేపర్​లో కెమిస్ట్రీ రాసేసి.. తలమీద బరువంత దిగిపోద్ది అనుకుంటే..' అంటూ సాగిన ఈ లిరిక్స్​కు అజనీశ్​ లోక్​నాథ్​ అందించిన మ్యూజిక్​ హైలైట్​గా నిలిచింది. సాయి చరణ్ ఆలపించారు. క్రైమ్‌, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను అన్నపూర్ణా స్టూడియోస్‌, ఛాయ్‌ బిస్కెట్‌ సంయుక్తంగా కలిసి ఆగస్టు 26న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో స్టార్‌ యాక్టర్స్​ కాంతార ఫేమ్​ రిషబ్‌ శెట్టి, రమ్య, దర్శకుడు పవన్‌కుమార్‌ అతిథి పాత్రల్లో సందడి చేశారు.

ఉత్కంఠగా పాయల్​ 'మంగళవారం' టీజర్​.. మ్యూజిక్ హైలైట్​

బెడ్​పై పాయల్ పరువాల విందు.. బాబోయ్​ ఆ పోజులు చూస్తే..

Last Updated : Aug 16, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.