ETV Bharat / entertainment

Pawan kalyan Birthday Wishes : 'వీరమల్లు' సర్​ప్రైజ్​.. హమ్మయ్యా.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. మ్యూజిక్​ హైలైట్ - happy birthday anna

Pawan kalyan Birthday Wishes Harihara Veeramallu New poster : నేడు(సెప్టెంబర్​ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' మూవీటీమ్.. పవన్ ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. ఆ వివరాలు..

EPawan kalyan Birthday Wishes : పవన్ ఫ్యాన్స్​కు 'హరిహర వీరమల్లు' సర్​ప్రైజ్​.. అదిరిపోయే అప్డేట్​ వచ్చిందోచ్​
Pawan kalyan Birthday Wishes : పవన్ ఫ్యాన్స్​కు 'హరిహర వీరమల్లు' సర్​ప్రైజ్​.. అదిరిపోయే అప్డేట్​ వచ్చిందోచ్​
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 6:37 AM IST

Updated : Sep 2, 2023, 9:14 AM IST

Pawan kalyan Birthday Wishes Harihara Veeramallu New poster : నేడు(సెప్టెంబర్​ 2) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ పండగ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. అలాగే ఆయన సినిమా అప్డేట్స్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే 'హరిహర వీరమల్లు' మూవీటీమ్​ ఆయన ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. పవన్​కు సంబంధించి ఓ మోషన్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది. అందులో పవన్..​ విలన్లను చితకబాది సీరియస్​గా నడుస్తూ వెళ్తున్నట్లు కనిపించారు. ఆయన వెనకాల భారీగా జనం గూమిగుడి ఉన్నారు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. "ఈ సంతోషకరమైన రోజున అసాధారణమైన ధైర్యం, దయ, కరుణ వంటి గుణాలు కలిగి ఉన్న మా హరిహర వీరమల్లు పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్​డే పవన్ కల్యాణ్ గారు" అంటూ రాసుకొచ్చింది.

ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్​గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు దాటేసింది. కానీ ఇప్పటికీ వరకు పూర్తి కాలేదు. ఆలస్యమవుతూనే వస్తోంది. అలానే ఈ సినిమా గురించి చాలా కాలం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో అభిమానులు అప్డేట్స్​ అడిగి అడిగి విసిపోయారు కూడా.

ఇక ఈ సినిమా గురించి ఆలోచించడం కూడా మానేశారు. అయితే ఆ మధ్యలో మాత్రం షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల సమయం దగ్గరపడటంతో పవన్ పొలిటికల్ కెరీర్​పై ఫోకస్​ పెట్టారని, సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమయ్యేది ఎలక్షన్స్ తర్వాతే అని ప్రచారం సాగింది. అయితే దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే పవన్ పుట్టినరోజు వచ్చిన సందర్భంగా.. ఈ సినిమా షూటింగ్​కు సంబంధించి ఏమైనా అప్డేట్​ చెబుతారని పవన్ ఫ్యాన్స్​ కాస్త ఆశించారు. అయితే మూవీటీమ్​.. షూటింగ్ అప్డేట్​ గురించి చెప్పలేదు కానీ.. తాజాగా బర్త్​డే విషెస్ తెలుపుతూ ఈ మోషన్​ పోస్టర్​ను(Harihara Veeramallu New poster) విడుదల చేసి జోష్ నింపేందుకు ప్రయత్నించింది. ఇకపోతే ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్ విర్క్, పూజిత పొన్నాడ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హరిహరా.. వీరమల్లు ఎక్కడ..?

హరిహర వీరమల్లు షూటింగ్​ సెట్​లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం!

Last Updated : Sep 2, 2023, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.