సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఊహించని కాంబినేషన్స్ జత కడతాయి. అవి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతాయి. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎక్సపెక్ట్ చేయని ఓ కాంబినేషన్ ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్ కె' సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తర్వాత మారుతీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఇంకో వషయమేమిటంటే.. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడా ప్రచారం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారట.
ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణతో 'అఖండ' సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు హీరో రామ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఆ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే.. రామ్‌తో సినిమా చేశాక.. ప్రభాస్ కోసం ఓ మాస్ సబ్జెక్టు రెడీ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. వీరి కాంబినేషన్ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారని సమాచారం.
ఇదీ చూడండి: జబర్దస్త్ కొత్త యాంకర్ గురించి ఈ విషయాలు తెలుసా