ETV Bharat / entertainment

తారక్​-ప్రశాంత్​నీల్ సినిమా సెట్స్​పైకి అప్పుడే.. రిలీజ్​ డేట్​ ఇదే! - ఎన్టీఆర్​ ప్రశాంత్​ నీల్​ సినిమా రిలీజ్ డేట్

NTR-Prasanth neel movie: ఎన్టీఆర్-ప్రశాంత్​నీల్​ కాంబోలో రానున్న సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మూవీని దసరాకి అధికారికంగా లాంచ్​ చేసి.. నవంబరు నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది.

NTR-Prasanth neel movie
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా
author img

By

Published : May 9, 2022, 9:14 AM IST

NTR-Prasanth neel movie: ఎన్టీఆర్​-కొరటాల శివ, ప్రశాంత్​ నీల్​-ప్రభాస్​ ఈ రెండు కాంబోల సినిమాలు పూర్తవ్వగానే తారక్​-ప్రశాంత్​ నీల్​ కలయికలో ఓ చిత్రం రాబోతుంది. ఈ మూవీ అనౌన్స్​ చేసినప్పటి నుంచి ఎప్పుడు సెట్స్​పైకి వెళ్తుందా, అప్డేట్స్​ ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త​ బయటకు వచ్చింది.

ఎన్టీఆర్​31వ రాబోతున్న ఈ మూవీనీ భారీ యాక్షన్​ డ్రామాగా తెరకెక్కించబోతున్నారట! దసరాకి అధికారికంగా లాంచ్​ చేసి.. నవంబరు నుంచి రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది. 2024 దసరాకి సినిమాను విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ కలయికపై సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్​ మాస్​ ఇమేజ్​కి ప్రశాంత్​ నీల్​ యాక్షన్ విజువల్స్​ తోడు అయితే మరో వండర్​ ఫుల్​ సినిమా అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఎన్టీఆర్​ ప్రస్తుతం 'ఆర్​ఆర్​ఆర్' తర్వాత కాస్త బ్రేక్​ తీసుకున్నారు. త్వరలోనే కొరటాల శివ సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ప్రశాంత్​​.. ప్రభాస్​తో 'సలార్'​ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఇందులో శ్రుతిహాసన్​ కథానాయిక.

ఇదీ చూడండి: సంక్రాంతికి విజయ్ కొత్త సినిమా.. కీలక పాత్రల్లో సీనియర్​ స్టార్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.