NTR 30 Koratala movie: దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో కలిసి ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ.. తనదైన శైలి, సామాజిక అంశాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబోతున్నట్లు తెలిసింది. తాజాగా 'ఆచార్య' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తారక్ సినిమా గురించి మాట్లాడారు.
"'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ లుక్, పాత్రను కొత్తగా చూపించడం వల్ల అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక 'ఆర్ఆర్ఆర్' సంచలన విజయం సాధించిన తర్వాత తారక్‌తో చేయబోయే సినిమాపై నా బాధ్యత మరింత పెరిగింది. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన పాత్ర ఉంటుందని చెప్పగలను. అందుకోసం భారీ కథను రాశాను. నా తొలి సినిమా 'మిర్చి'ని మించి ఇందులో మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మాస్ ఓవర్‌డోస్‌లో ఉంటుంది" అని కొరటాల అన్నారు.
కాగా, ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ కోసం తారక్ శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అనిరుధ్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేసినట్లు తెలిసింది. రష్మికను హీరోయిన్గా తీసుకోవాలని మూవీటీమ్ భావిస్తోందట. 'జనతా గ్యారేజ్' లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం కావడం వల్ల.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: బాలకృష్ణకు మరో సర్జరీ.. నిజమేనా?