ETV Bharat / entertainment

రెడీ అంటున్న యంగ్​ హీరోలు.. తెరపైకి సరికొత్త కాంబోలు.. - రామ్ హరీశ్ శంకర్ సినిమా

akhil venu sriram new movie: బాక్సాఫీసు దగ్గర ఇదివరకటిలా ఇప్పుడు సందడే లేదు. ప్రారంభ వసూళ్లు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కొత్త సినిమా వారం రోజులు కూడా నిలబడటం లేదు. పెట్టుబడి వ్యయం.. టికెట్‌ ధరలు.. ప్రేక్షకుడి నిరాసక్తత.. ఇలా బోలెడన్ని సమస్యలు చిత్రసీమని పట్టి పీడిస్తున్నాయి. అయినా సరే, ఇవేవీ కొత్త కథలు తయారు కావడానికీ, కొత్త కలయికలు వెలుగులోకి రావడానికీ ప్రతిబంధకం కావడం లేదు. బాక్సాఫీసు లెక్కలు వేరు, సృజనాత్మకత వేరని చాటుతూ రచయితలు, దర్శకులు తమ కలాలకి పదును పెడుతూనే ఉన్నారు. కథలు సిద్ధం చేస్తూ హీరోల్ని ఒప్పించే పనిలో ఉన్నారు. దాంతో పలు కొత్త కలయికలు ప్రచారంలోకి వస్తున్నాయి.

akhil venu sriram new movie
వేణు శ్రీరామ్ అఖిల్ కాంబినేషన్ సినిమా
author img

By

Published : Jul 21, 2022, 7:00 AM IST

akhil venu sriram new movie: కరోనా విరామంలో చాలామంది హీరోలు రెండు మూడు కథలు పక్కా చేసి పెట్టుకున్నారు. వాటితోనే ఇప్పుడు వరుసగా సినిమాలు చేసే పనిలో ఉన్నారు. కొంతమంది తారలు మాత్రం మా దగ్గర మరో కథకు చోటుందనే సంకేతాలు పంపుతున్నారు. వాళ్లనే టార్గెట్‌ చేసుకుంటున్న దర్శకులు తగిన కథలు సిద్ధం చేసి వినిపిస్తున్నారు. పూర్తిస్థాయి స్క్రిప్టులు నచ్చడంతోపాటు, మిగతా సమీకరణన్నీ కుదిరితే ఆయా కలయికల్లో సినిమాలు దాదాపుగా ఖాయమైనట్టే అనేది పరిశ్రమలో వినిపిస్తున్న మాట. కొన్ని కలయికలు ఇప్పటికే ఖరారు కావడంతో స్క్రిప్టు పనులతో దర్శకులు బిజీ బిజీగా గడుపుతున్నారు.

.

కొన్నాళ్లుగా చిత్రసీమలో అఖిల్‌ అక్కినేని - శ్రీరామ్‌ వేణు కలయిక గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. 'వకీల్‌సాబ్‌'తో సత్తా చాటిన శ్రీరామ్‌ వేణు మళ్లీ దిల్‌రాజు సంస్థలోనే సినిమా చేయడం కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. ఆ కథని అఖిల్‌కి వినిపించి, సినిమాని పట్టాలెక్కించాలనేది నిర్మాత దిల్‌రాజు ఆలోచనగా తెలిసింది. దీనికి 'తమ్ముడు' అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. సాయితేజ్‌-సంపత్‌ నంది కలయికలో సినిమాకి స్క్రిప్టు ముస్తాబవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆ సినిమా రూపొందనుంది. సాయితేజ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాతోపాటు, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం పూర్తయ్యాక.. సంపత్‌ నంది సినిమా కోసమే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

.

నితిన్‌- సాగర్‌ కె.చంద్ర, వరుణ్‌తేజ్‌ - సుజీత్‌ కాంబినేషన్‌ల స్క్రిప్టులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌తో 'భీమ్లానాయక్‌'ని తెరకెక్కించిన సాగర్‌ కె.చంద్ర ఈసారి ఓ యాక్షన్‌ కథతో సినిమా చేయనున్నట్టు తెలిసింది. కథని ఆయన ఇప్పటికే నితిన్‌కి వినిపించారని టాక్‌. ప్రభాస్‌తో 'సాహో' తెరకెక్కించిన సుజీత్‌ నుంచి ఈ ఏడాదిలోనే కొత్త సినిమాని పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. 'లూసిఫర్‌', 'తేరి' రీమేక్‌ల విషయంలో సుజీత్‌ పేరు బలంగా వినిపించింది. అయితే తాజాగా ఆయన వరుణ్‌తేజ్‌ కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కలయిక గురించి స్పష్టత రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

.
.

రామ్‌ పోతినేనితో జట్టు కట్టడానికి హరీష్‌శంకర్‌, అనిల్‌ రావిపూడిలు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇటీవల రామ్‌ విలేకరుల సమావేశంలో స్వయంగా వెల్లడించారు. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా 'భవదీయుడు భగత్‌సింగ్‌' సినిమాని తెరకెక్కించనున్నారు హరీష్‌శంకర్‌. ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనే విషయంలో స్పష్టతలేదు. ఆ చిత్రం తర్వాతే రామ్‌- హరీష్‌శంకర్‌ కలయికలో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. 'విరాటపర్వం'తో సత్తా చాటిన వేణు ఊడుగుల తయారు చేస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథలో కూడా ఓ అగ్ర కథానాయకుడు నటిస్తారని సమాచారం. కరోనా తర్వాత మారిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని అగ్ర తారలు, యువ కథానాయకులు కథలు సిద్ధం చేయిస్తున్నారు.

.

ఇవీ చదవండి: మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య.. ఇదిగో ప్రూఫ్​!

Laal Singh chaddha: 'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్​ చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.