Ranbir kapoor-Aliabhatt costly plot: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ పెళ్లి ఏప్రిల్ 14న ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక కన్నుల పండగగా సాగింది. అయితే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వీరి పెళ్లికి హాజరుకాలేదు. కానీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కత్రినా కైప్, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా సహా పలువురు సెలబ్రిటీలు ఖరీదైన కానుకలను పంపారని తెలిసింది.
అయితే అందులో ముఖ్యంగా రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఇచ్చిన బహుమతి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ముంబయిలోని ఓ విలాసవంతమైన అపార్టుమెంట్‌లోని సిక్స్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చిందట! దాని విలువ దాదాపు రూ.26కోట్లు అని బాలీవుడ్ సర్కిల్ టాక్. కాగా, రణ్‌బీర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్స్ కత్రినా-రూ.14లక్షల ప్లాటినం బ్రాస్లెట్, దీపికా పదుకొణె రూ.15లక్షల కపుల్ వాచ్, ప్రియాంక చోప్రా రూ.9లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఇచ్చారని తెలిసింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా రూ.3లక్షల హ్యాండ్‌బ్యాగ్, వరుణ్ ధావన్ రూ.4లక్షల గూచీ హై హీల్ చెప్పు, అర్జున్ కపూర్ లక్షన్నర విలువ చేసే గూచీ జిప్పర్ జాకెట్‌ను కానుకలుగా ఇచ్చారని సమాచారం.
ఇక రణ్‌బీర్-ఆలియా సినిమాల విషయానికొస్తే.. వీరిద్దరి కలిసి 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే తొలి భాగం చిత్రీకరణ పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో పాటే రణ్‌బీర్.. సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటిస్తుండగా.. ఆలియా 'డార్లింగ్స్', 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని' చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ జంట షూటింగ్స్‌లో పాల్గొంటారు.
ఇదీ చూడండి: రణ్‌బీర్ రెమ్యూనరేషన్ రూ.70 కోట్లు! మరి ఆలియా లెక్క ఎంత?