ETV Bharat / entertainment

ఈ నటుడెవరో గుర్తుపట్టుకోండి చూద్దాం - నవాజుద్దీన్‌ సిద్దిఖీ వైరల్​ ఫొటో

ప్రముఖ బాలీవుడ్​ నటుడు నటించిన ఓ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది. అందులో ఉన్నది అతడేనా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే.

Nawazuddin Siddiqui
Nawazuddin Siddiqui
author img

By

Published : Aug 25, 2022, 6:53 AM IST

Nawazuddin Siddiqui: ప్రతిభ ఉన్న నటుడిగా నవాజుద్దీన్‌ సిద్దిఖీకి బాలీవుడ్‌లో మంచి పేరుంది. చిన్న చిన్న పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నవాజుద్దీన్‌.. దర్శకులు తనకో ప్రత్యేక పాత్రను సృష్టించే స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం తానే ప్రధాన పాత్రలో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన తన చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఉన్నది అతనేనా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నవాజుద్దీన్‌ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించిన 'హడ్డీ' చిత్రం అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను ఆ చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అందులో స్త్రీ పాత్రలో కనిపిస్తున్న నవాజుద్దీన్‌ను చూసి ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. అతడేనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Nawazuddin Siddiqui
నవాజుద్దీన్‌ సిద్దిఖీ

మోడ్రన్‌ డ్రెస్‌లో ఒక కుర్చీలో కూర్చుని సీరియస్‌ లుక్‌ ఇస్తున్న నవాజుద్దీన్‌ నటనను ప్రశంసిస్తున్నారు. ఇది నవాజుద్దీన్‌ కొత్త ప్రయోగమంటూ కితాబిస్తున్నారు. అయితే ఈ మోషన్‌ పోస్టర్‌లో నవాజుద్దీన్‌ అచ్చం బాలీవుడ్‌ నటి అర్చనా పూరన్‌ సింగ్‌లా ఉన్నాడని కొందరంటున్నారు. ఇంకొంతమంది 'ఈ పాత్ర కోసం ఆమెనే సంప్రదించొచ్చుగా..మేకప్‌ ఖర్చులు మిగులుతాయి' అంటూ చిత్ర యూనిట్‌కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ మోషన్‌ పోస్టర్‌ ట్రెండింగ్‌గా నిలుస్తోంది. అక్షత్‌ అజయ్‌ శర్మ దర్శకత్వం వహస్తున్న 'హడ్డీ' చిత్రం 2023లో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:తిట్టడం కోసమే నా షో చూస్తున్నారు, అయినా నాకు ఆనందమే

ఈ బుల్లితెర హీరోయిన్​ను చూస్తే నిశా ఎక్కాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.