ETV Bharat / entertainment

నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్! - నరేశ్​ పవిత్రా లోకేశ్​ టీదజర్​

Naresh Pavitra Lokesh Malli Pelli: టాలీవుడ్​ సీనియర్​ నటుడు నరేశ్​, నటి పవిత్రా లోకేశ్​ 'మళ్లీ పెళ్లి'కి.. ముహూర్తం ఫిక్స్ అయింది!.. అవునండీ నిజమే!!.. ఆ ముహుర్తం ఎప్పుడంటే?

naresh pavitra lokesh malli pelli movie teaser released

author img

By

Published : Apr 21, 2023, 12:25 PM IST

Updated : Apr 21, 2023, 1:06 PM IST

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే! త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు! ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. అయితే అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి‌ ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్‌ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రా‍న్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్ మొదట్లోనే డాక్టర్ నరేశ్​ వీకే 50 గోల్డెన్ ఇయర్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ కృష్ణ బ్యానర్ కింద నరేశ్​ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి కథతోపాటు దర్శకత్వం వహిస్తున్నాడు ఎమ్మెస్ రాజు. ఇప్పటికే ఈ మళ్లీ పెళ్లి నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రాగా.. తాజాగా టీజర్​తో మరోసారి మేకర్స్ ఆసక్తి పెంచారు. ఈ టీజర్ వనితా విజయ్‌కుమార్ మీడియా సమావేశంతో మొదలవుతోంది. తన భర్త తనను మోసం చేశాడని, అతడో మృగం అని అంటుంది. మరోవైపు నరేశ్​ అదే సమయంలో పవిత్రా లోకేష్ తో రొమాన్స్​లో మునిగి తేలుతుంటారు. ఇక ఈ టీజర్​ను కూడా చాలా ఆసక్తిగా ముగించారు. నరేశ్​, పవిత్ర ఒకరికొకరు కన్ను కొట్టుకుంటూ లోపలికి వెళ్దామా అన్నట్లుగా ముగించారు. ఇప్పటికే భిన్నమైన స్టోరీ లైన్లతో వస్తున్న ఎమ్మెస్ రాజు.. ఇప్పుడు కూడా అలాంటి స్టోరీలైన్​తో వచ్చారు.

ఈ చిత్రంలో జయసుధ, శరత్‌బాబు, వనితా విజయ్ కుమార అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన‍్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Last Updated : Apr 21, 2023, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.