ETV Bharat / entertainment

బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ మూవీకి నాని 'దసరా' ఎఫెక్ట్​.. రిలీజ్​కు ముందే..!

author img

By

Published : Mar 29, 2023, 8:38 PM IST

బాలీవుడ్ స్టార్ యాక్టర్​ అజయ్ ​దేవగణ్​ నటించిన 'భోలా' సినిమాపై నేచురల్ స్టార్​ నాని 'దసరా' మూవీ ఎఫెక్ట్​ పడేలా ఉంది. ఆ వివరాలు..

Nani
బాలీవుడ్ స్టార్​ యాక్టర్​ మూవీకి నాని 'దసరా' ఎఫెక్ట్​

కొత్త డైరెక్టర్​ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచరుల్ స్టార్​ నాని-హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'దసరా'. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ సినిమా మార్చి30న గ్రాండ్​గా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కలెక్షన్స్​.. బాలీవుడ్ సూపర్ స్టార్ యాక్టర్​ అజయ్ దేవగన్ నటించిన 'భోలా' మూవీపై ప్రభావం పడనుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి రిలీజ్​కు ముందు నుంచే 'దసరా'కు ఫుల్ బజ్​ క్రియేట్​ అయింది. ఇప్పటికే నాని, కీర్తిసురేశ్​.. మాస్ యాక్షన్ పోస్టర్స్​, ట్రైలర్​, సాంగ్స్​​ బాగా ఆకట్టుకోవడంతో.. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మార్చి 30న పాన్​ ఇండియా రేంజ్​లో రిలీజ్​ కానున్న ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1300 స్క్రీన్‌లలో ప్రదర్శన కానుందని తెలిసింది. ఉదయం 5 గంటల నుంచే షోలు వేయనున్నారట. నాని కెరీర్​లోనే ఇది బిగ్గెస్ట్​ రిలీజ్​. అయితే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌.. రూ.50 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. ఇది మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే మార్చి 30నే బాలీవుడ్ స్టార్ యాక్టర్​ అజయ్ దేవగన్‌ నటించిన 'భోలా' కూడా థియేటర్లలో విడుదల కానుంది. తమిళ హీరో కార్తి హీరోగా నటించిన 'ఖైదీ'కి రిమేక్​గా రూపొందింది. అయితే ఈ చిత్రానికి ఇక్కడ అంతగా బజ్​ క్రియేట్ కాలేదనే చెప్పాలి! ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రంలో అజయ్​ దేవగణ్​ మాస్ యాక్షన్ సీన్స్​ ఆకట్టుకున్నప్పటికీ.. దానిని బాలకృష్ణ 'అఖండ'తో పోల్చారు. అలా ఈ చిత్రంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్​ కలెక్షన్స్​ రూ.1.15కోట్లు వచ్చినట్లు తెలిసింది. అలా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్​లో డౌన్​ అయిన ఈ సినిమాకి.. నాని 'దసరా' ఎఫెక్ట్​ గట్టిగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కానున్న నేపథ్యంలో.. ఒకవేళ దసరాకు మంచి టాక్ వస్తే.. భోలాకు గట్టి పోటీ తప్పదు. అయితే ఈ అడ్వాన్స్ బుక్సింగ్​ కలెక్షన్స్​ వివరాల పక్కా స్పష్టత ఏమీ లేదు.

కాగా, ఇటీవలే ఈ విషయంపై నాని కూడా మాట్లాడారు. ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలన్నింటినీ ఎంతో కష్టపడి చేసినట్లు తెలిపారు. ఓ చిత్రాన్ని చేస్తున్నప్పుడు ప్రేక్షకుని స్థానంలో ఉండి చేస్తానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్ అంటే తనకు అభిమానమని.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రతి సినీ ప్రేక్షకుడు.. రెండు చిత్రాలను ఆదరించాలని కోరారు.

ఇదీ చూడండి: వెంకటేశ్ 'సైంధవ్'​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​.. ఆ రోజు బాక్సాఫీస్​ బద్దలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.