ETV Bharat / entertainment

పవన్​-రవితేజతో బాలయ్య పోటీ.. ఆ సినిమాలు రిలీజ్​ అప్పుడే! - రవితేజ టైగర్​ నాగేశ్వరరావు రిలీజ్​ డేట్

టాలీవుడ్​లోని అగ్రహీరోలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమ సినిమాలను ప్రేక్షకులకు చూపించేందుకు వీలైనంత త్వరగా షూటింగ్స్​ను కంప్లీట్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దసరాకు రిలీజయ్యే సినిమాలు ఇవేనంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటంటే..

nbk 108 release date
nbk 108 release date
author img

By

Published : Feb 18, 2023, 3:56 PM IST

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం 'వీర సింహా రెడ్డి' సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తన అప్​కమింగ్ ప్రాజెక్ట్​ గురించి అప్పట్లో అనౌన్స్​ చేశారు. అలా తన 108వ సినిమా కోసం బాలయ్య..'ఎఫ్​3' డైరెక్టర్​ అనిల్ రావిపుడితో ​ చేయి కలిపారు. ఫాదర్​ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో సాగే ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా యంగ్​ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. సాహు గారపాటి, హరీశ్​ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్​ను పూర్తి చేసుకోగా.. తదుపరి షెడ్యుల్​ ఫిబ్రవరి 23నుంచి మొదలవ్వనుంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సినిమాను 2023 దసరాకు రిలీజే చేయాలని చిత్ర యూనిట్​ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

పవన్​-రవితేజ కూడా.. పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాలతోనూ ఇటు సినిమా షూటింగులతోనూ బిజీగా ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులకు సైన్​ చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సాహో ఫేమ్ సుజీత్​తో ఓ మూవీ.. ఇంకా కోలీవుడ్ హిట్ 'వినోదయ సీతమ్' రీమేక్​. అయితే క్రిష్​ పీరియాడికల్​ డ్రామా 'హరిహర వీరమల్లు' మాత్రం పవర్ స్టార్​ అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది. ఎందుకంటే ఇటువంటి జానర్​లో పవన్​ నటించడం ఇదే తొలిసారి.

అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పోస్టర్​తో పాటు పవన్​ లుక్​ను చూసిన ఫ్యాన్స్​ ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ కూడా దసరాకు విడులయ్యేందుకు సిద్ధంగా ఉందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అరవై శాతం షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్​లో థియేటర్లలో సండది చేయనుందని టాక్ వినిపిస్తోంది​.

మరోవైపు 'ధమాకా' సక్సెస్​తో ఫుల్​ జోష్​లో ఉన్న మాస్​ మహారాజా రవితేజా.. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్​ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. స్టువర్ట్​పురం గజ దొంగ, ఇండియన్​ రాబిన్​ హుడ్​ అయిన టైగర్​ నాగేశ్వరరావు బయోపిక్​గా ఈ చిత్రం రూపొందుతోంది. పాన్ ఇండియా లెవల్​లో రూపొందుతున్న ఈ స్టోరీ లైన్​ విన్న ఫ్యాన్స్​ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతటి గజ దొంగ పాత్రలో రవితేజ ఎలా ఉంటారో అని ఎగ్జైటింగ్​గా వెయిట్​​ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా 2023 దసరాకు విడుదల కానున్నట్లు సమాచారం. అలా పవన్​ హరిహర వీరమల్లు, రవితేజ టైగర్ నాగేశ్వరరావు కూడా దసరాకు సిద్ధమైతే.. 'ఎన్​బీకే 108'కు గట్టి పోటీనిచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో.

వేసవిలో 'ఉగ్రం'.. టాలీవుడ్​లో కామెడీ పండించే అతి కొద్దిమంది హీరోల్లో ఒకరైన అల్లరి నరేశ్​... 'నాంది' సినిమాతో తన రూట్​ మార్చారు. ప్రేక్షకులకు తనలోని కొత్త కోణాన్ని చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా కాసుల వర్షాన్ని కురిపించింది. అంతే కాకుండా ఈ సినిమా దర్శకుడు విజయ్​ కనకమేడలకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అయితే వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం 'ఉగ్రం' అనే మరో సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్​ థ్రిల్లర్​ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏప్రిల్​ 14న రిలీజ్​ కానున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రిలీజ్​ డేట్​ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. మే 5న విడుదలకు వాయిదా పడిందని సమాచారం. అయితే రీసెంట్​గా ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన సమంత శాకుంతల.. ఏప్రిల్ 14న కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రం వెనక్కి తగ్గాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.