ETV Bharat / entertainment

'వీరసింహారెడ్డి' ట్విట్టర్​ రివ్యూ.. ఇంటర్వెల్​ సీన్​లో బాలయ్య ఎమోషన్​తో అదరగొట్టేశారుగా! - వీరసింహారెడ్డి మూవీ న్యూస్​

సంక్రాంతి సంబరాన్ని ముందే తెచ్చారు నందమూరి బాలకృష్ణ. సిల్వర్​ స్క్రీన్​పై మాస్​ ఎంటర్టైనర్​గా ఎంట్రీ ఇచ్చారు. గురువారం రిలీజైన ఈ సినిమా గురించి ఆడియన్స్​ తమ అభిప్రాయాలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంటున్నారు. ఓ సారి ఆ టాక్​ ఏంటో చూసేద్దాం రండి.

veera simha reddy twitter review
veera simha reddy
author img

By

Published : Jan 12, 2023, 8:46 AM IST

Updated : Jan 12, 2023, 9:21 AM IST

బాలయ్య ఫ్యాన్స్​ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా రానే వచ్చింది. సంక్రాంతి ముందే సంబరాన్ని తెచ్చేందుకు వీరసింహారెడ్డిగా బాలయ్య ధియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక తమ అభిమాన నటుడు సైతం హైదరాబాద్ కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌లో అభిమానులతో కలిసి వీరసింహారెడ్డి చిత్రాన్ని వీక్షించగా ఫ్యాన్స్​ ఆనందానికి అవధుల్లేవు. బొమ్మ బ్లాక్​ బస్టర్​ అంటూ ఫ్యాన్స్​ కేకలు పెడుతున్నారు.

బెనిఫిట్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్​లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా మాస్​ ఎంటర్​టైనర్​​గా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంటర్వెల్​ సీన్​లో బాలయ్య ఎమోషన్​తో కన్నీళ్లు తెప్పించారని చెబుతున్నారు. జై బాలయ్య సాంగ్​ వచ్చినప్పుడు అయితే.. ప్రేక్షకులు తెర ముందు ఆనందంతో చిందులు వేస్తున్నారు. మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా అన్​స్టాపబుల్​ అంటూ ట్విట్టర్​లో రివ్యూలు ఇస్తున్నారు ఫ్యాన్స్​.

Last Updated : Jan 12, 2023, 9:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.