ETV Bharat / entertainment

నాగార్జున బిగ్​బాస్ సీజన్​ 6​ ఫస్ట్ గ్లింప్స్​ ఆగయా - నాగార్జున బిగ్​బాస్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్​

Bigboss first glimpse released రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 6 త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్​ను రిలీజ్​ చేశారు మేకర్స్​.

Big Boss first glimpse
నాగార్జున బిగ్​బాస్ సీజన్​ 6​ ఫస్ట్ గ్లింప్స్​ ఆగయా
author img

By

Published : Aug 31, 2022, 5:32 PM IST

Bigboss first glimpse released బుల్లితెర తెలుగు ప్రేక్షకులను వీపరితంగా అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'. త్వరలోనే 'సీజన్‌6' ప్రేక్షకుల ముందుకు రానుంది. గత మూడు సీజన్ల (3,4,5)కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. ప్రస్తుతం ఈ కొత్త సీజన్​లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తయింది. అంతేకాదు, వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నిర్వహించే గ్రాండ్‌ ఎంట్రీ ఈవెంట్‌ను కూడా దాదాపు పూర్తి చేశారు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. టీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమంతోపాటు 'ఓటీటీ బిగ్‌బాస్‌'కీ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సెప్టెంబరు 4వ తేదీ నుంచి 'బిగ్‌బాస్‌ సీజన్‌-6' టెలికాస్ట్‌ కానుంది. ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున పారితోషికం బాగా పెరిగినట్లు సమాచారం. ఈసారి ఆయన రూ.15కోట్లు తీసుకుంటున్నారని టాక్‌. మరి ఈ సీజన్‌లో ఎంతమంది హౌస్‌లోకి వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారు? తెలియాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: మహేశ్​బాబుతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన తరుణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.