ETV Bharat / entertainment

లైఫ్​లో కాంప్రమైజ్​ అవ్వన్నంటున్న చైతూ.. 'డెడ్​' అంటూ సామ్ పోస్ట్​ - samantha dead post

'థ్యాంక్ యూ' సినిమా టీజర్..​ లైఫ్​లో కాంప్రమైజ్​ అయ్యే ప్రసక్తే లేదని అంటున్నారు యువ హీరో నాగచైతన్య. మరోవైపు సామ్​ తన ఇన్​స్టా స్టోరీస్​లో​ 'డెడ్'​ అనే పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్​ చేసింది.

Nagachaitanya thanku tease
నాగచైతన్య థ్యాంక్యూ టీజర్
author img

By

Published : May 25, 2022, 6:26 PM IST

Nagachaitanya Thanku movie teaser: నాగచైతన్య పలు విభిన్న లుక్స్‌లో కనిపించనున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవిక నాయర్‌ కథానాయికలు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. విభిన్న ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాలు చూస్తే అర్థమవుతోంది. క్లాస్‌, మాస్‌ గెటప్‌లో చైతన్య కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి సంభాషణలోనూ విక్రమ్‌ కుమార్‌ మార్క్‌ కనిపిస్తుంది. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్‌హిట్‌ చిత్రం 'మనం' తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో 'థ్యాంక్‌ యూ' పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Samanth delete post: హీరోయిన్​ సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్​మీడియాలోనూ మోటివేషనల్​ కొటేషన్స్​ పోస్ట్​ చేస్తూ యాక్టివ్​గా ఉంటోంది. అయితే తాజాగా ఆమె తన ఇన్​స్టా స్టోరీస్​లో ఓ పోస్ట్​ చేసి.. వెంటనే డిలీట్​ చేసింది. మంగళవారం 'థోర్​: లవ్​ అండ్ థండర్​' సినిమా ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం చూసిన సామ్​.. తన ఇన్​స్టా స్టోరీస్​లో 'డెడ్'​ అని రాసి ఫైర్​ ఎమోజీ పెట్టింది. కానీ ఆ తర్వాత డిలీట్ చేసింది. అనంతరం ఈ చిత్రంలోని క్రిస్టియన్​ బాలే లుక్​ను షేర్​ చేస్తూ 'ది గాడ్​ ఆఫ్​ యాక్టింగ్'​ అని వ్యాఖ్య రాసుకొచ్చింది.

samantha
సమంత

ఇదీ చూండి: ముంబయిలో గ్రాండ్‌ పార్టీ.. సౌత్​ నుంచి రష్మిక-విజయ్‌కు మాత్రమే ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.