ETV Bharat / entertainment

ట్రైన్​లో నుంచి దూకేద్దామనుకున్నా.. కానీ ఆమె స్ఫూర్తితోనే..: మృణాల్​ ఠాకూర్​

చెంపకు చారెడేసి కళ్లు... వెన్నెల వంటి చల్లని చిరునవ్వుతో రామయ్య కోసం హైదరాబాద్‌ నుంచి కశ్మీర్‌ వెళ్లిన సీతామహాలక్ష్మి... సగటు ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది కదా! రాకుమారిగా దర్బారీ దర్పానికి సిగ్గూ ప్రేమలను కలబోస్తూ ఆ పాత్రలో మృణాల్‌ ఠాకూర్‌ జీవించేసింది. ఆత్మహత్య ఆలోచనల్లో కూరుకుపోయిన రోజుల నుంచి 'సీతారామం'తో విజయాన్ని రుచి చూసే వరకూ... 'సీత' పడిన కష్టాలెన్నో! వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాలేమిటో... చెబుతోందిలా!

mrunal thakur
మృణాల్ ఠాకూర్​
author img

By

Published : Oct 2, 2022, 9:44 AM IST

'నువ్వొచ్చావేంటీ... అసలు నువ్వు హీరోయిన్‌గా ఎలా పనికొస్తావూ... అయినా మేం ఫ్రెష్‌ ఫేస్‌ కోసం వెతుకుతున్నాం, సీరియళ్లలో నటించేవాళ్లు సినిమాలకి పనికి రారు...' అనే మాటలే ఎదురయ్యేవి- నేను సీరియళ్లలో నటిస్తూ సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్లినప్పుడు. ఎంతో ఇష్టంతో సినిమాల్లోకి రావాలనుకున్నా... హీరోయిన్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్నో అవమానాలు ఎదుర్కొని, మరెన్నో సవాళ్లను దాటుకుని పట్టుదలతో ఆ లక్ష్యాన్ని చేరుకున్నా. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా నేను నడిచి వచ్చినదారిని మర్చిపోను.

నేను పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని ధులెలో. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడంతో తరచూ బదిలీ అవుతుండేది. దాంతో ఇంటర్‌ పూర్తయ్యేలోపు పదకొండు స్కూళ్లు మారా. అందుకే నాకు స్కూలు ఫ్రెండ్స్‌ ఎవరూ ఉండేవారు కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా... నాన్నకి ముంబయి బదిలీ అవ్వడంతో అక్కడి స్కూల్లో చేర్పించారు. అప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల్లోనే చదువుకున్న నేను సిటీ స్కూల్లో చేరడం అదే మొదటిసారి. తోటివిద్యార్థులు నాకు ఇంగ్లిష్‌ రాదని ఎగతాళి చేసేవారు. బాధపడకుండా పట్టుదలతో ఇంగ్లిష్‌ నేర్చుకోవాలని రోజూ న్యూస్‌పేపరు చదివేదాన్ని. కెనడా గాయకుడు జస్టిన్‌ బీబర్‌ పాటలు వింటూ చరణాల్ని రాసుకుని ప్రాక్టీస్‌ చేసేదాన్ని. అలా మూడునెలలు సాధన చేసి ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరూ షాక్‌ అయ్యారు. క్లాస్‌లో కూడా ఫస్ట్‌ మార్కులు తెచ్చుకోవడంతో టీచర్లంతా పొగడ్తలతో ముంచెత్తారు. తొమ్మిదో తరగతికి వేరే స్కూలుకు వెళుతుంటే అందరూ బాధపడ్డారు. అలా చదివే నాకు ఇంటర్‌ అయ్యాక డెంటిస్ట్‌ అవ్వాలనిపించింది. బీడీఎస్‌ చేద్దామని ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ రాసి మంచి ర్యాంకు తెచ్చుకున్నా. దానికే మా అమ్మానాన్నలు నేను డాక్టరైనంత సంబరపడిపోయారు. కానీ, కొన్నిరోజులకి మీడియాలోకి వెళదామనిపించింది. అమ్మానాన్నలేమో ఆ రంగంలోకి వద్దంటే వద్దన్నారు. నాన్న కూల్‌గా ఉన్నరోజు '3 ఇడియట్స్‌' చూపించా. నచ్చిన పనే చేయాలనే ఆ సినిమా సందేశం వారికి నచ్చి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అలా బ్యాచిలర్స్‌ ఇన్‌ మాస్‌ మీడియా (బీఎమ్‌ఎమ్‌)లో చేరా. అయితే నాన్న తన స్నేహితులకి నా చదువు గురించి చెబితే వాళ్లు 'బీఎమ్‌ఎమ్‌ నా... అదేం కోర్సు? ఎప్పుడూ వినలేదే' అన్నప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడేవారు. కొన్నాళ్లకి నాన్నకి మరోప్రాంతానికి బదిలీ కావడంతో నేను ముంబయిలో ఉండాల్సొచ్చింది. ఆ సమయంలో ఒకవైపు ఒంటరితనం, మరోవైపు నాన్నని బాధపెడుతున్నానన్న భావన.. చదువుమీద దృష్టి పెట్టలేకపోయేదాన్ని. మీడియా రంగం కూడా నాకు కరెక్ట్‌ కాదని కొంతకాలానికి అనిపించింది. ఇన్ని ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లా. కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలొచ్చేవి. డోర్‌ దగ్గర నిలబడి లోకల్‌ ట్రైన్‌లో కాలేజీకి వెళుతుంటే కిందకు దూకేయాలనిపించేది. అలా చేస్తే అమ్మానాన్నలు తట్టుకోలేరని క్రమంగా సమస్య నుంచి బయటపడే ప్రయత్నాలు చేశా. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన స్నేహితుల వల్ల వచ్చింది. ప్రీతీజింతాలా నేనూ మోడలింగ్‌ ద్వారా సినిమాల్లో ఛాన్స్‌ పొందాలనుకున్నా. చదువుకుంటూనే మోడలింగ్‌ వైపొచ్చా. ఓ షోలో నన్ను చూసిన దర్శకుడొకరు 2012లో 'ముఝే కుఛ్‌ కెహ్‌తీ హై ఖామోషియా' అనే సీరియల్‌లో అవకాశమిచ్చారు.

mrunal thakur
మృణాల్ ఠాకూర్​

ఆ సినిమా చేయలేకపోయా.. ఆ తరవాత వచ్చిన 'కుంకుమ భాగ్య' హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రసారమై మంచి పేరును తెచ్చింది. ఒకవైపు సీరియళ్లు చేస్తూనే సినిమా ఆడిషన్స్‌కూ వెళ్లేదాన్ని. కానీ, ఎవరూ రానిచ్చేవారు కాదు. సీరియళ్లలో నటిస్తూ, టీవీ రియాలిటీ షోల్లో పాల్గొనడంతో చులకనగా చూసేవారు. అలా ఎన్నో ప్రయత్నాలు చేశాక 'సుల్తాన్‌'లో అవకాశం వచ్చింది. సల్మాన్‌ఖాన్‌ పక్కన అనుష్క పోషించిన పాత్రలో నిజానికి నేనే నటించాలి. ఆ పాత్రకోసం దర్శక నిర్మాతలు కొన్నిరోజులు మల్లయుద్ధంలో నాకు శిక్షణ ఇప్పించారు. మూడు నెలల్లో పదకొండు కిలోలు తగ్గా. ఏమైందో ఏమో చివరికి అవకాశం అనుష్క శర్మ చెంతకు చేరింది. 'బహుశా... నేను ఎక్కువ బరువు తగ్గడంతో వాళ్ల కళ్లకి మల్ల యోధురాలిగా కనిపించలేదేమో' అని పాజిటివ్‌గా తీసుకుని మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టా. అప్పుడే 'లవ్‌ సోనియా' ఆడిషన్‌కి పిలిచారు. అప్పటికే ఆ సినిమాలో లీడ్‌రోల్‌ కోసం రెండువేల మందికిపైగా అమ్మాయిల్ని ఆడిషన్‌ చేశారు. అదృష్టం కొద్దీ ఆ ఇండో అమెరికన్‌ సినిమాలో నటించే అవకాశం నాకే వచ్చింది. అక్కా చెల్లెళ్ల నేపథ్యంలో సాగుతుంది సినిమా. అందులో అక్రమ రవాణాకి బలైన చెల్లిని రక్షించడానికి అదే రొంపిలోకి దిగి వ్యభిచార గృహానికి చేరుకున్న యువతిగా నటించా. షూటింగ్‌కి కొన్నిరోజుల ముందు కోల్‌కతాలోని ఓ వేశ్యాగృహంలో రెండువారాలు ఉన్నా. అక్కడున్న వారి కథలు తెలుసుకున్నాక తట్టుకోలేకపోయా. బీపీ డౌన్‌ అయింది. పదే పదే వాళ్ల కథలే చెవుల్లో మార్మోగుతుండేవి. కొన్నాళ్లకి డిప్రెషన్‌లోకి వెళ్లడంతో దర్శకుడు నాకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా నేను ఆ పాత్ర చేయలేననిపించేది. పైగా 'సుల్తాన్‌' చేజారిన వెంటనే వచ్చిన అవకాశం. దాన్ని చేజేతులా వదులుకుంటే అదో చెడు సంకేతంగా పరిశ్రమ వర్గాలు భావించే ప్రమాదముందని ధైర్యం చేసి షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లా. తీరా దర్శకుడు యాక్షన్‌ చెప్పేసరికి నటించలేక ఏడుపొచ్చింది. ఎందుకంటే సుమారు పదహారు, పదిహేడు సంవత్సరాల అమ్మాయిని 60 ఏళ్ల వృద్ధుడికి అమ్మే సన్నివేశమది. ఆ డైలాగులు చెబుతుంటే వేశ్యల కథలు కళ్ల ముందు మెదిలాయి. నటించలేనని దర్శకుడికి చెప్పి సెట్‌లో కుప్పకూలిపోయా. 'మృణాల్‌, నిన్ను బలవంతపెట్టను. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వు ఈ సన్నివేశం చేస్తే ప్రపంచం చూస్తుంది.

mrunal thakur
మృణాల్ ఠాకూర్​

దీనివల్ల కొందరు అమ్మాయిలకైనా న్యాయం జరుగుతుంది' అని చెప్పారు. ఆ మాటలు శక్తినిచ్చాయి. చేయలేనన్న ఆ సీన్‌ను సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశా. సెట్‌లోని వారంతా చప్పట్లు కొట్టారు. 'లవ్‌ యూ మృణాల్‌' అంటూ జనాలు నన్నూ, నా నటననూ మెచ్చుకున్న ఆ సినిమా నాకో మైలురాయి. పైగా చాలా దేశాల్లో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా ఈ సినిమాను ప్రదర్శించారు. మెల్‌బోర్న్‌లో ప్రదర్శించినప్పుడు నేనూ

వెళ్లా. అప్పుడు 'మహానటి' గురించి వచ్చిన నాగ్‌అశ్విన్‌ పరిచయమయ్యారు. అదే నా కెరీర్‌లో అతిపెద్ద మలుపు అని ఆ సమయంలో తెలియలేదు.

కాఫీషాప్‌లో కలిశాం.. లవ్‌ సోనియా తరవాత పెద్ద హీరోల సినిమాలు వరస కట్టాయి. అలా 'సూపర్‌ 30', 'బాట్లా హౌస్‌', 'తూఫాన్‌', 'ధమాకా', 'జెర్సీ'ల్లో చేశా. ఓటీటీలో వెబ్‌సిరీస్‌లూ చేశా. ఆ తరవాత వచ్చిన 'సీతారామం' జీవితాంతం గుర్తుంచుకునే విజయాన్నిచ్చింది. హిందీ 'జెర్సీ' షూటింగ్‌లో ఉన్నప్పుడు హను రాఘవపూడి ఫోన్‌ చేసి సినిమా కథ చెప్పాలన్నారు. వెంటనే ముంబయి వచ్చా. ఓ కాఫీ షాప్‌లో కలిశాం. ఆయన కథ చెప్పే తీరు నచ్చింది. ఆ తరవాత కథా, సీతామహాలక్ష్మి పాత్రా నచ్చేశాయి.

mrunal thakur
మృణాల్ ఠాకూర్​

ఆ పాత్రతో ప్రేమలో పడిపోయి వెంటనే ఒప్పేసుకున్నా. ఆ సినిమాది 1960 నేపథ్యం కావడంతో అమ్మమ్మతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నా. రాణీ గాయత్రీ దేవి వంటి వారి కాస్ట్యూమ్స్‌, హెయిర్‌స్టైల్స్‌పై అధ్యయనం చేశా. యూట్యూబ్‌లో వీడియోల ద్వారా వారి ఆహార్యం, హావభావాల్నీ గమనించా. తెలుగు పలకడం, యాస వంటివాటిపై పట్టుతెచ్చుకున్నా. నా వంతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలో నటించా. కశ్మీర్‌లో 10డిగ్రీల చలిలో షూట్‌ చేసినప్పుడు మాత్రం తట్టుకోలేకపోయేదాన్ని. సీత పాత్ర మీదున్న ఇష్టంతో ఆ కష్టాన్ని కూడా అధిగమించగలిగా. సినిమా ఫలితం చూశాక శ్రమంతా మర్చిపోయా. ఆ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది. ఇంకా మరిన్ని తెలుగు సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలనుకుంటున్నా.

అండగా అమ్మానాన్నలు.. కెరీర్‌ను ప్రారంభించిన తొలినాళ్లలో చాలామంది చులకనగా మాట్లాడేవారు. ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని. ఇక సినిమాల్లో చేయొద్దనిపించేది. ఆ సమయంలో 'పదేళ్ల తరవాత నీ లైఫ్‌ ఎలా ఉండాలనుకున్నావో ఆలోచించుకో. నువ్వు కొందరికైనా ఇన్స్పిరేషన్‌గా ఉండాలి' అని అమ్మానాన్నలు ప్రోత్సహించేవారు. మాకు '3 ఇడియట్స్‌' చూపించింది ఈ అమ్మాయేనా అని ఆటపట్టించి నన్ను నవ్వించేవారు. నాన్న ఎంత దూరంలో ఉన్నా నీకు నేనున్నాననే ధైర్యాన్నిచ్చేవారు.

mrunal thakur
మృణాల్ ఠాకూర్​

వాళ్లిద్దరూ నా ఫస్ట్‌ క్రష్‌... సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలామంది 'నువ్వు కుండలా ఉన్నావు' అనేవారు. మట్కా అని నిక్‌నేమ్‌ కూడా పెట్టారు. చాలా బాధపడి సోషల్‌ మీడియాకు దూరమయ్యా. ఒకసారి అమెరికా వెెళ్లినప్పుడు 'నువ్వు భారతీయ కర్దాషియాన్‌లా ఉంటావు' అని హాలీవుడ్‌ నటి డెమీమూర్‌ పొగిడింది. అది జీవితంలో మర్చిపోలేని ప్రశంస. అప్పట్నుంచీ ట్రోల్స్‌ని పట్టించుకోవడం మానేశా.

  • చిన్నప్పట్నుంచే ఆటలు చాలా ఇష్టం. క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ ఆడేదాన్ని. కొన్ని జోనల్‌ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నా.
  • చిన్నప్పుడు హృతిక్‌రోషన్‌, షాహిద్‌కపూర్‌ ఫొటోల్ని చించి పుస్తకాల్లో పెట్టుకుని చూసుకునేదాన్ని. వాళ్లిద్దరూ నా ఫస్ట్‌ క్రష్‌. వాళ్లతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఎగిరిగంతేశా.
  • కవితలు రాయడం, ఫొటోగ్రఫీ నా హాబీలు. కొత్త ప్రదేశాలకు వెళ్తే ఫొటోలు తీసి ఆల్బమ్‌లు చేయిస్తుంటా.
  • 'కలలు లేని బతుకు వ్యర్థం. ఆ స్వప్నాల వెెంట నిత్యం పరుగులు తీస్తూనే ఉండాలి' అనే సిద్ధాంతం నాది.
    mrunal thakur
    మృణాల్ ఠాకూర్​

ఇదీ చూడండి: 'స్వాతిముత్యంతో 'కామెడీ' ప్రయోగం.. త్వరలో బాలయ్యతో సినిమా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.