ETV Bharat / entertainment

స్టంట్​మెన్ వేటలో ప్రభాస్.. చెర్రీ షూటింగ్ పూర్తి.. సమంత ట్రైలర్ అప్డేట్! - kaathu vaakula rendu kadhal trailer

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే, రామ్​చరణ్ షూటింగ్​కు సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. సమంత నటించిన కాతువాక్కుల రెండు కాదల్​ ట్రైలర్​కు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్.

MOVIE UPDATES
MOVIE UPDATES
author img

By

Published : Apr 21, 2022, 10:52 PM IST

stunt crew call for project k: ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ సినిమా 'ప్రాజెక్ట్​ కే'. దీపికా పదుకొణే కథానాయిక. అశ్వనీదత్‌ నిర్మాత. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చి దిద్దిన సెట్స్‌లో జరుగుతోంది. సింహభాగం సన్నివేశాల్ని ఇక్కడే తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసింది. కాగా, ఈ సినిమా నుంచి కీలక ప్రకటన వెలువడింది. సినిమా కోసం పనిచేసేందుకు స్టంట్​మెన్, కొరియోగ్రాఫర్స్, మార్షల్ ఆర్టిస్ట్స్​లు కావాలని పేర్కొంది. ఆసక్తి కలిగిన నిపుణులు తమను సంప్రదించాలని కోరింది.

MOVIE UPDATES
ప్రాజెక్ట్ కే ప్రకటన

Ram charan punjab shoot: రామ్​చరణ్ ఈ మధ్య బిజీబిజీగా గడుపుతున్నారు. నెలన్నర క్రితం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్​లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్​ను ఎంజాయ్ చేసిన చెర్రీ.. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్​పై ఫోకస్ చేశారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం పంజాబ్​కు వెళ్లారు. అక్కడ గోల్డెన్ టెంపుల్​లో ప్రత్యేక పూజలు చేయించారు. షూటింగ్ మధ్యలో ఖాసాలో బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి ముచ్చటించారు. కాగా, పంజాబ్ షెడ్యూల్​ను తాజాగా పూర్తి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్​కు బయల్దేరారు. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్ వేదికగా తెలిపారు చరణ్.

MOVIE UPDATES
షూటింగ్ ముగించుకొన్న చరణ్

kaathu vaakula rendu kadhal trailer: సమంత, నయనతార, విజయ్‌ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం 'కాతువాకుల రెండు కాదల్‌'. తెలుగులో 'కణ్మణి రాంబో ఖతీజా' అనే పేరుతో విడుదల కానుంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు. లవ్‌, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రౌడీ పిక్చర్స్‌తో కలిసి 7 స్క్రీన్‌ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 28న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ బయటకొచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు సినిమా ట్రైలర్​ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

MOVIE UPDATES
ట్రైలర్ అప్డేట్

ఇదీ చదవండి:

యశ్ నోట బాలయ్య డైలాగ్.. 'కేజీఎఫ్-2' సక్సెస్​పై ఎమోషనల్!

హీరో భార్యతో ఎలాన్ మస్క్ రాసలీలలు.. విడాకుల కేసులో ట్విస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.