ETV Bharat / entertainment

Miss Shetty Mr Polishetty Review : అనుష్క- నవీన్‌ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే ? - మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ తెలుగు రివ్యూ

Miss Shetty Mr Polishetty Review : అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

miss shetty mr polishetty review
miss shetty mr polishetty review
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 2:32 PM IST

Miss Shetty Mr Polishetty Review : చిత్రం: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి; నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, అనుష్క, మురళీ శర్మ, జయసుధ, తులసి, సోనియా దీప్తి, అభినవ్‌ గోమఠం, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు; నేపథ్య సంగీతం: గోపీ సుందర్‌; సంగీతం: రధన్‌; రచన, దర్శకత్వం: పి.మహేశ్​ బాబు; ఛాయాగ్రహణం: నీరవ్‌ షా; నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌; విడుదల తేదీ: 07-09-2023

తన నటనతో పాటు కామెడీ టైమింగ్​తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు టాలీవుడ్​ యంగ్​ హీరో నవీన్‌ పొలిశెట్టి. డిఫరెంట్​ రోల్స్​ చేస్తూ తన సత్తా చాటుతున్నారు నటి అనుష్క. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్​లో 'మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి' సినిమా రూపొందింది. గురువారం ఈ సినిమా థియేటర్లలో రిలీజై సందడి చేస్తోంది. మరి ఈ సినిమా కథేంటంటే?

స్టోరీ ఏంటంటే : అన్వి అలియాస్‌ అన్విత రవళి శెట్టి (అనుష్క) ఓ మాస్టర్‌ చెఫ్‌. లండన్‌లో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో పని చేస్తుంటుంది. ఇక తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్​షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లి (జయసుధ)ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వాడు మోసం చేయడమే. అయితే, తన తల్లి అనారోగ్యంతో కన్నుమూశాక అన్వి ఒంటరి అవుతుంది. ఈ క్రమంలో దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది.

అయితే పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీని కోసం వీర్య దాత కోసం వెతుకుతున్న సమయంలో.. స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి (నవీన్‌ పొలిశెట్టి) అన్వికి పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ సిద్ధులో కనిపించడం వల్ల అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది. అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడిన సిద్ధు ఓ రోజు తనకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. అలా తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది.

ఆమె నిర్ణయం తెలిసి సిద్ధు ఒక్కసారిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్ధమంటూ అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి ప్రతిపాదనను అన్వి ముందుకు తీసుకొస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా? అసలు ఆమె భారత్‌ నుంచి లండన్‌కు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా స్టోరీ.

ఎలా సాగిందంటే: ప్రేమ.. పెళ్లి అంటే గిట్టని ఓ అమ్మాయికి.. ఈ రెండు బంధాల్ని బలంగా విశ్వసించే అబ్బాయికి మధ్య జరిగే ఓ వినూత్నమైన లవ్​ స్టోరీ ఈ మూవీ. అయితే ఈ కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇస్తూనే.. మంచి వినోదం.. చక్కటి భావోద్వేగాలను మేళవించారు దర్శకుడు. ఈ క్రమంలో తాను అనుకున్న ఫలితాన్ని సాధించారు. కథగా చూస్తే ఇది చాలా చిన్న లైన్‌ అయినప్పటికీ వినోదం.. భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని రెండున్నర గంటలు కూర్చోబెట్టగలిగేలా చేశారు. అన్విత ప్రపంచాన్ని.. ఆమె వ్యక్తిత్వాన్ని.. తల్లితో ఉన్న అనుబంధాన్ని పరిచయం చేస్తూ వచ్చే ఇంట్రో సీన్స్​ పర్వాలేదనిపిస్తాయి. అయితే తల్లి అనారోగ్యంతో చావుకు దగ్గరవడం.. తన కోరిక మేరకు అన్వి ఆమెను తీసుకొని భారత్‌కు రావడం.. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే తల్లి కన్నుమూయడం.. ఇలా తొలి 20నిమిషాలు అన్విత పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. తల్లి మరణం తర్వాత ఒంటరి అయిన అన్వి తాను కూడా తల్లి కావాలని నిర్ణయించుకోవడం వల్ల అసలు కథ మొదలవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Miss Shetty Mr Polishetty Telugu Review : ఇక నవీన్‌ పొలిశెట్టి పాత్ర తెరపైకి వచ్చినప్పటి నుంచి అప్పటి వరకు కాస్త సీరియస్‌గా సాగిన ఈ స్టోరీ ఒక్క సారిగా కామెడీగా మారుతుంది. స్టాండప్‌ కమెడియన్‌గా తన పాత్ర పరిచయ సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అన్వి తన జీవితంలోకి వచ్చాక ఓ కన్ఫ్యూజింగ్‌ డ్రామా మొదలవుతుంది. ఆమె అసలు విషయం దాచి పెట్టి తాను అనుకున్న లక్షణాలు సిద్ధులో ఉన్నాయా లేదా? అని తెలుసుకోవడం ప్రారంభించడం నుంచి ఆమె తన చుట్టూ తిరగడాన్ని సిద్ధు ప్రేమగా భావించడం ఇలా పలు ఎపిసోడ్‌లు హిలేరియస్‌గా వర్కవుట్‌ అయ్యాయి. ముఖ్యంగా హోటల్‌లో అన్విత - సిద్ధుల మధ్య వచ్చే ఇంటర్వ్యూ ఎపిసోడ్, హాస్పిటల్‌లో సిద్ధు హెల్త్‌ చెకప్‌ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి.

అలాగే సిద్ధు కుటుంబ నేపథ్యం.. ఇంట్లో వాళ్లకు తాను తనకంటే వయసులో పెద్ద అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు పరోక్షంగా చెప్పే సన్నివేశాలు కూడా సరదాగా సాగుతాయి. ఇంటర్వెల్​కు ముందు అన్వితకు సిద్ధు సినిమాటిక్‌ స్టైల్‌లో ప్రపోజ్‌ చేయడం.. వెంటనే ఆమె తనకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని చెప్పడం.. అది విని సిద్ధు షాక్‌ అవ్వడం ఇలా అన్నీ వెంటనే రావడం వల్ల.. సెకెండ్ హాఫ్​ ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది.

అయితే ఫస్ట్​ హాఫ్​ మొత్తం నవ్వుల రైడ్‌లా సాగిన సినిమా.. ద్వితీయార్ధంలో కాస్త ఎమోషనల్​గా మారుతుంది. అన్విత షాకింగ్‌ నిర్ణయం విని సిద్ధు కన్ఫ్యూజన్‌లో పడటం.. ఆమెను దూరం చేసుకోలేక తనలో తానే బాధ పడటం.. ఇలా ద్వితీయార్ధంలో తొలి 20నిమిషాలు కథ కాస్త సీరియస్‌గానే సాగుతుంది. ఇక ఐయూఐ ప్రక్రియ మొదలయ్యాక సినిమా మళ్లీ వినోదాత్మకంగా మారుతుంది.

వీర్యదానం కోసం సిద్ధును సిద్ధం చేసే తీరు.. ఈ క్రమంలో హాస్పిటల్‌లో అతను చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత అన్వి-సిద్ధు విడిపోవడం నేపథ్యంలో వచ్చే సీన్స్‌ భావోద్వేగభరితంగా ఉంటాయి. అన్వికి దూరమయ్యే ముందు సిద్ధు "నీ బిడ్డకు తండ్రెవరంటే ఎవరో డోనర్‌ అని చెప్పకు.. నీ అమ్మను ప్రేమించిన గొప్ప ప్రేమికుడని చెప్పు" అని అనడం మదిని బరువెక్కిస్తుంది. పతాక సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా.. హీరో హీరోయిన్స్​ ఎమోషన్స్‌ కంటతడి పెట్టిస్తాయి.

ఎవరెలా చేశారంటే: స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్‌ పొలిశెట్టిని తప్ప మరొకరిని మనం ఊహించుకోలేం. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆ పాత్రను అవలీలగా చేసి చూపించారు. అలా ప్రేక్షకుల్ని ఆద్యంతం కడుపుబ్బా నవ్వించారు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్‌ను చక్కగా పండించారు. అన్విత పాత్రలో అనుష్క ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించింది. మరోవైపు దర్శకుడు ఆమె పాత్రను చాలా హుందాగా తీర్చిదిద్దారు. ఆమెకు.. నవీన్‌కు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.

క్లైమాక్స్‌లో ఎమోషనల్​ సీన్స్​లో తన నటనతో ఆమె అందరి మదిని బరువెక్కిస్తుంది. ఆమె తల్లిగా జయసుధ కొద్దిసేపు నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. నాజర్, మురళీ శర్మ, తులసి.. తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. అభినవ్‌ గోమఠంకు పెద్దగా నవ్వించే ఆస్కారం దొరకలేదు. అయితే దర్శకుడు తాను రాసుకున్న కథకు కాస్త బోల్డ్‌ టచ్‌ ఇచ్చినప్పటికీ.. ఎక్కడా లిమిట్స్ దాటలేదు. హద్దు మీరకుండా తాను చెప్పాలనుకున్న విషయాన్ని టూకీగా, వినోదాత్మకంగా తెరపై చూపించారు. సినిమాని ఆరంభించిన తీరు మాత్రం సాదాసీదాగా ఉంటుంది. అనుష్క పాత్ర గతాన్ని చూపించకపోవడం వల్ల ఆమెలోని భయాల్ని ప్రేక్షకులు సరిగ్గా ఫీలవ్వలేరు. అమ్మాయి, అబ్బాయి మధ్య ఏమీ జరగకున్నప్పటికీ.. ఒక్క ముద్దు కూడా పెట్టుకోకున్నా ప్రేమ పుడుతుందంటూ దర్శకుడు చెప్పిన తీరు బాగుంది. రధన్‌ పాటలు వినసొంపుగా ఉన్నాయి. కానీ, గుర్తుంచుకునేలా లేవు. గోపీసుందర్‌ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్ ఆకట్టుకుంటుంది. నీరవ్‌ షా ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు బాగున్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం..
  • + నవీన్, అనుష్క నటన
  • + వినోదం.. భావోద్వేగాలు
  • బలహీనతలు
  • - ఆరంభ సన్నివేశాలు
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: శెట్టి - పొలిశెట్టి.. నవ్విస్తూ మదిని బరువెక్కిస్తారు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.