ETV Bharat / entertainment

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న 'వీరయ్య'.. 10 రోజుల్లోనే రూ.200 కోట్లు! - వాల్తేరు వీరయ్య వార్తలు

మెగాస్టార్​ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా.. పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించింది.

megastar-waltair-veerayya-crossed-rs-200-crores-gross-10-days

author img

By

Published : Jan 23, 2023, 9:07 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ సినిమా 'వాల్తేరు వీరయ్య' ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోనే వందకోట్లు కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మూవీ భారీ విజయంతో చిత్రబృందం ఫుల్‌ జోష్‌లో ఉంది. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

'వాల్తేరు వీరయ్య' విడుదలైన పది రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పంచుకుంది. కేవలం పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు రావడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది.
'వాల్తేరు వీరయ్య' సినిమాతో మెగాస్టార్ అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. బాస్‌ పార్టీ సాంగ్, మెగాస్టార్ యాక్టింగ్‌, డ్యాన్స్‌, గ్రేస్‌కు ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్‌. మాస్‌ మహారాజా రవితేజ కూడా సినిమాలో ఉండగా వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.