ETV Bharat / entertainment

Bhola Shankar: మెగాస్టార్​కు గ్రాండ్ వెల్‌కమ్.. దగ్గరుండి మరీ తీసుకెళ్లిన చిరు చెల్లెలు! - చిరంజీవి భోళా శంకర్​

'వాల్తేరు వీరయ్య' సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ చేసిన ఆయనకు 'భోళా శంకర్' మూవీ టీమ్ గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పింది. ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఆ వివరాలు..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jan 19, 2023, 9:07 PM IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇస్తున్నారు. గతేడాది కొరటాల శివతో చేసిన 'ఆచార్య' మూవీ నిరాశపరిచినప్పటికీ.. 'గాడ్ ఫాదర్' మూవీతో హిట్ కొట్టారు. ఇదే క్రమంలో సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరు.. మరో హిట్ అందుకున్నారు. దర్శకుడు బాబీ తన అభిమాన హీరో చిరంజీవిని చూపించిన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న చిరంజీవి.. తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ చేశారు. తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భోళా శంకర్' సెట్స్‌లో అడుగుపెట్టారు.

అయితే, ఈ మూవీ సెట్స్‌లోకి మెగాస్టార్‌ను గ్రాండ్‌గా ఆహ్వానించింది 'భోళా శంకర్' టీమ్. ఇందుకు సంబంధించిన వీడియోను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ట్విట్టర్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. చిరంజీవి బ్లాక్ కలర్ కారులో ఎంట్రీ ఇవ్వగానే ఎదురెళ్లిన మూవీ టీమ్.. ఆయనకు వెల్‌కమ్ చెప్పారు. పూలు జల్లుతుండగా ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, డైరెక్టర్ మెహర్ రమేష్, కీర్తి సురేష్ దగ్గరుండి మరీ మెగాస్టార్‌ను తీసుకెళ్లారు. అనంతరం కేక్ కట్ చేసి చిరంజీవి ఎంట్రీని సెలబ్రేట్ చేసుకున్నారు.

తమిళ్‌లో శివ దర్శకత్వంలో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రాన్ని చిరంజీవి తెలుగులో 'భోళా శంకర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా.. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించనుంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇదేగాక చిరంజీవి మరో తమిళ్ రీమేక్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్త వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ దర్శకత్వ బాధ్యతలను వీవీ వినాయక్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. వినాయక్ ఇప్పటికే మెగాస్టార్‌తో 'ఠాగూర్', 'ఖైదీ నెం. 150' చిత్రాలకు కలిసి పనిచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.