ETV Bharat / entertainment

సామ్​ అద్భుతమైన అమ్మాయి.. త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నా: చిరు - samantha unhealth

మయోసైటిస్​తో బాధపడుతున్న అగ్ర కథానాయిక సమంత త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుందంటూ ఆయన ట్వీట్​ చేశారు. ఇంకేమన్నారంటే?

megastar chiranjeevi tweet on actress samantha health issue

author img

By

Published : Oct 30, 2022, 1:36 PM IST

Samantha Chiranjeevi Tweet: నటి సమంతను ఉద్దేశిస్తూ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. సామ్‌ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. "డియర్‌ సామ్‌.. కాలానుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. అతి త్వరలో ఈ సమస్యను నువ్వు అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది. ధైర్యంగా ఉండాలి" అని చిరు ధైర్యం చెప్పారు.

ఎంతో కాలం నుంచి సోషల్‌మీడియాకు దూరంగా ఉన్న సమంత శనివారం సాయంత్రం తన అనారోగ్య పరిస్థితిని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. తాను 'మయోసైటిస్‌'తో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో దీని నుంచి కోలుకుంటానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ తారలందరూ ఆమెలో ఆత్మస్థైర్యం నింపేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు సమంత నటించిన 'యశోద' చిత్రం నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. అదే నెలలో విజయ్ దేవరకొండతో నటిస్తున్న 'ఖుషి' చిత్రం తదుపరి చిత్రీకరణలో సమంత పాల్గొనే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది.

ఇవీ చదవండి:

'ప్రేక్షకులను తప్ప నేనెవరినీ మోసం చేయలేదు'.. నెట్టింట వైరల్​గా మారిన పూరీ లెటర్!

'వాటర్​ క్యాన్లు మోసుకెళ్లా.. అప్పులోళ్లకు కనబడకుండా మారువేషాల్లో తిరిగా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.