సినీ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరుగా ఓ ఇంటివారవుతున్నారు. ఇప్పటికే నితిన్, రానా, నిఖిల్ లాంటి యంగ్ హీరోలంతా తమ ఇష్టమైన వారితో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టగా.. తాజాగా శర్వానంద్ కూడా ఇదే దారిలోకి వచ్చాడు. ఇక మిగిలిన వారంతా ఎప్పుడు ఈ గుడ్ న్యూస్‌ను వెల్లడిస్తారంటూ తమ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న సమయంలో మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు స్వయాన ఆ హీరో తండ్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగా హౌస్ యంగ్ హీరో వరుణ్ తేజ్.
కాగా ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగబాబు తన తనయడు పెళ్లి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ విషయాన్ని వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని పేర్కొన్నారు. అయితే అమ్మాయి ఎవరనే విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు నాగబాబు. పెళ్లి కూతురుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే చెప్పలేనని, ఆ విషయాలన్ని వరుణ్ తేజ్ తప్పకుండా తెలియజేస్తాడని తెలిపారు.
అయితే ఇటీవలే లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌లో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతే కాకుండా ఓ వ్యాపారవేత్త కూతురిని కూడా వరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సైతం వినిపించాయి. అయితే ఆ విషయాలపై నాగబాబు స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎస్వీసీసీ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీకి బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్‌లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.