ETV Bharat / entertainment

Mahesh Rajamouli Movie : జక్కన్న - మహేశ్ సినిమాలో విలన్​గా టాలీవుడ్ స్టార్ హీరో! - మహేశ్ రాజమౌళి సినిమా విలన్​

Mahesh Rajamouli Movie : రాజమౌళి - మహేశ్ బాబు సినిమాలో.. ప్రస్తుతం టాలీవుడ్​లో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఒకరు విలన్​గా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ సంగతులు..

Mahesh Rajamouli Movie : జక్కన్న - మహేశ్ సినిమాలో విలన్​గా టాలీవుడ్ స్టార్ హీరో!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 7:12 PM IST

Updated : Oct 28, 2023, 3:24 PM IST

Mahesh Rajamouli Movie : ప్రస్తుతం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సూపర్​స్టార్​ మహేశ్​ బాబు - రాజమౌళి కాంబో. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా..? అంటూ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో మహేశ్​ బాబు - రాజమౌళి సినిమాలో టాలీవుడ్​కు చెందిన ప్రస్తుత టాప్ హీరో విలన్​గా నటించబోతున్నారని కథనాలు వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళితే.. ఎస్ఎస్ రాజమౌళి... ఈ పేరే ఓ బ్రాండ్. ఆయన సినిమాలో హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనేది ప్రేక్షకులు చూడరు. థియేటర్లకు పోటెత్తుతారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చవి చూడని దర్శకుడాయన. 'ఆర్​ఆర్​ఆర్'​తో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్​ అందుకున్న ఆయన ఇప్పుడు మహేశ్‌ బాబుతో సౌతాఫ్రికా అడవుల నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో చూడని అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. అయితే ఇది ఇంకా మొదలు కాకముందు నుంచే చాలా వార్తలు వినిపిస్తున్నాయి. రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. కానీ దీనిపై మూవీటీమ్​ కానీ.. మహేశ్‌ బాబు, రాజమౌళి కానీ ఎవరూ స్పందించడం లేదు.

అయితే ఈ చిత్రం కోసం హాలీవుడ్​ టెక్నిషియన్స్​ పనిచేయబోతున్నారని, హాలీవుడ్ యాక్టర్స్​ నటించబోతున్నారని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మన టాలీవుడ్​ స్టార్ హీరో నటించబోతున్నారని కథనాలు మొదలయ్యాయి. ఆయన రాజమౌళికి జాన్ జిగిడి దోస్త్ కూడా! ఇప్పటికే ఆయనతో సినిమా తీసి హూజ్​ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. ఆయన మరెవరో కాదు మాస్​ మహారాజా రవితేజ. విక్రమార్కుడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన కృతజ్ఞతతో రవితేజ.. మహేశ్​ సినిమాలో విలన్​గా నటించడానికి ఒప్పుకున్నారట. క్రుయాలిటి రోల్ లో రవితేజ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. పైగా ఇటీవలే టైగర్ ప్రమోషన్స్​లో జక్కన్నతో చేయాలని రవితేజ కూడా తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే మరోవైపు మాస్​ మహారాజా విలన్ రోల్​కు ఏమి షిఫ్ట్ అవ్వరు? అసలీ వార్త ఫేక్ అంటూ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Warner Alluarjun : వార్నర్​కు అల్లు అర్జున్​ స్పెషల్ మెసేజ్​.. ఇప్పుడిదే ట్రెండింగ్​!

OTT Movies And Web Series This Week : ఓటీటీలోకి 'చంద్రముఖి-2'.. ఈ వారం ఇంకా ఏయే సినిమాలు రానున్నాయంటే?

Last Updated : Oct 28, 2023, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.