ETV Bharat / entertainment

'ఐ యామ్​ బ్యాక్'.. మహేశ్​ పోస్ట్​ వైరల్.. అందుకే ఆయన్ను టాలీవుడ్​ ప్రిన్స్​ అంటారంట! - mahesh babu rajamouli movie

సూపర్​ స్టార్ మహేశ్​ బాబు​ తిరిగి షూటింగ్​లో బిజీ కాబోతున్నారు. తాజాగా ఓ యాడ్​ షూటింగ్​లో పాల్గొన్నారు. అందులో భాగంగా దిగిన ఫొటోను ప్రేక్షకులతో పంచుకున్నారు. 'తిరిగి పనిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చారు.

mahesh babu ad shoot
mahesh babu ad shoot
author img

By

Published : Dec 4, 2022, 5:26 PM IST

Updated : Dec 4, 2022, 7:33 PM IST

సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు మళ్లీ షూటింగ్​లో బిజీ కానున్నారు. ఇటీవలే మహేశ్​ తండ్రి సూపర్​ స్టార్​ కృష్ణ మరణించారు. అదే కాకుండా ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబసభ్యులకు దూరమయ్యారు మహేశ్​ బాబు. ఈ ఏడాది ప్రారంభంలో తన సోదరుడు రమేశ్​ బాబు మరణించారు. అనంతరం తల్లి ఇందిరా దేవి పరమపదించారు. కాగా, ఆ బాధ నుంచి తేరుకుని తిరిగి పనిలో నిమగ్నమయ్యారు మహేశ్​.

తాజాగా ఓ యాడ్​ షూటింగ్​లో పాల్గొన్న సూపర్​స్టార్​ను.. ఫొటోగ్రాఫర్​ సురేశ్​ నటరాజన్​ క్లిక్​ మనిపించారు. దాన్ని మహేశ్​ తన సోషల్​ మీడియా ఖాతాలో పోస్ట్​ చేశారు. 'పనిలోకి తిరిగి వచ్చా.. మీతో పని చేయడం ఆనందంగా ఉంది' అని ఫొటోగ్రాఫర్​ను ఉద్దేశించి రాసుకొచ్చారు. ఈ ఫొటోను నటరాజన్​ కూడా షేర్​ చేశారు. కాగా, ఆ ఫొటోలో మహేశ్​ లుక్​ అదిరిపోయేలా ఉంది. టీషర్ట్​ మీద లెదర్​ జాకెట్​తో చాలా స్టైలిష్​గా ఉన్నారు. ఇంత అందంగా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని టాలీవుడ్​ ప్రిన్స్​ అంటారని ఫ్యాన్స్​ కామెంట్లు పెడుతున్నారు.

mahesh babu ad shoot
యాడ్​ షూట్​లో మహేశ్​ బాబు

మహేశ్​ ప్రస్తుతం త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా SSMB28 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోంది. కాగా, మహేశ్​ సరసన పూజ హెగ్డే ఆడిపాడనుంది. ఈ చిత్రానికి నవీన్​ నూలి ఎడిటర్​గా పనిచేస్తున్నారు. తమన్ ఎస్​​ సంగీతం సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా అనంతరం.. దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్​లో SSMB29 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న సినిమాలో మహేశ్​ నటించనున్నారు. ఈ చిత్రం పాన్​ వరల్డ్​ రేంజ్​లో ఉండబోతోందని సమాచారం.

ఇవీ చదవండి : పవన్​ కల్యాణ్​తో 'ఫ్యాన్​ బాయ్​' సినిమా.. పోస్టర్​తోనే 'పవర్​'ఫుల్ మెసేజ్​..

'రతన్​ టాటా బయోపిక్'పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. ఏమన్నారంటే!

Last Updated : Dec 4, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.