ETV Bharat / entertainment

Mahesh Rajamouli Movie : మహేశ్​-రాజమౌళి మూవీ అప్డేట్​!.. సినిమా షూటింగ్​ అప్పుడేనా? - మహేశ్​ బాబు కొత్త సినిమా అప్డేట్​

Mahesh Babu Rajamouli Movie : దిగ్గజ దర్శకుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్​​ మహేశ్​ బాబు కాంబినేషన్​లో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అదిరిపోయే అప్డేట్​ వచ్చింది. అదేంటంటే..

mahesh babu rajamouli movie
mahesh babu rajamouli movie
author img

By

Published : Jun 13, 2023, 10:46 PM IST

Updated : Jun 13, 2023, 10:59 PM IST

Mahesh Babu Rajamouli Movie : 'ఆర్​ఆర్​ఆర్​'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తుంపు సాధించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఈ డైరెక్టర్​.. టాలీవుడ్​ స్టార్​ హీరో మహేశ్​​ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్​ అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అనంతరం దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం పూర్తి కథను సిద్ధం చేసేందుకు దర్శకుడు రాజమౌళికి మరో రెండు నెలలు పట్టనుందట. ఆ తర్వాత మహేష్ బాబుకు మరోసారి కథ మొత్తం చెప్పనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రీ విజువలైజేషన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారట. 2024లో షూటింగ్‌ ప్రారంభిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనాలు ప్రచురించింది.

ఫ్రాంచైజీగా మహేశ్​-రాజమౌళి సినిమా!
అంతకుముందు మహేశ్​-రాజమౌళి సినిమాపై రచయిత విజయేంద్ర ప్రసాద్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ''మహేశ్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్‌ ఫ్రాంఛైజీగా రానుంది. ఈ సినిమా నుంచి సీక్వెల్స్‌ వస్తుంటాయి. సీక్వెల్స్‌లో కథలు మారుతుండొచ్చు. కానీ, ప్రధాన పాత్రలు మాత్రం అవే ఉంటాయి. ప్రస్తుతం పార్ట్‌1 స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నాం'' అని వెల్లడించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న ప్రాజెక్ట్‌ ఇదే. యాక్షన్‌ అడ్వంచర్‌ సినిమాగా ఇది సిద్ధం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర తారాగణంతో భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందించనున్నారట. పలువురు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ సైతం ఇందులో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. కాగా, 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న వరల్డ్​ వైడ్​గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Last Updated : Jun 13, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.