ETV Bharat / entertainment

విజయ్​- వంశీ పైడిపల్లి సినిమాలో సూపర్​ స్టార్​?

Maheshbabu -vijay movie: వంశీ పైడిపల్లి-విజయ్​ కాంబోలో రూపొందుతున్న సినిమాలో సూపర్​ స్టార్​ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Mahesh babu in Vamsipaidipally vijay movie
విజయ్​-వంశీపైడిపల్లి సినిమాలో సూపర్​స్టార్​?
author img

By

Published : Jun 8, 2022, 7:44 AM IST

Maheshbabu -vijay movie: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ల ట్రెండ్​ ఎక్కువైంది. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేయడం లేదా ఓ హీరో చిత్రంలో మరో కథానాయకుడు గెస్ట్​ రోల్​లో కనిపించి సినిమాపై హైప్​ పెంచుతున్నారు. తాజాగా ఓ​ ఇంట్రెస్టింగ్​ కాంబో తెరపైకి వచ్చింది. ​

తమిళ స్టార్​ హీరో విజయ్‌- వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్‌, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సూపర్​స్టార్​ మహేశ్​ బాబు గెస్ట్​ రోల్​ చేయబోతున్నారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. అటు తెలుగులో ఇటు తమిళంలో ఈ ఇద్దరు హీరోలకు ఫుల్​ ఫాలోయింగ్​ ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబోని సెట్​ చేసే పనిలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారని బజ్​ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, ప్రభు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ హీరోలతో నటించాలని ఉంది: నజ్రియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.