ETV Bharat / entertainment

'గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా! - గుంటూరు కారం ట్రైలర్

Mahesh Babu Guntur Kaaram : 'గుంటూరు కారం' సినిమా విషయంలో ఓ కోయిన్సిడెన్స్ అభిమానులను కాస్త కలవరపెడుతోంది! ఆ వివరాలు.

'గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 12:56 PM IST

Mahesh Babu Guntur Kaaram : ఈ సంక్రాంతికి థియేటర్లలో రాబోయే సినిమాల్లో బాగా హైప్ ఉన్న చిత్రం 'గుంటూరు కారం'. మహేశ్​ బాబు - త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే. అయితే ఇప్పుడో విషయం మహేశ్​ అభిమానులను కాస్త భయపెడుతోంది. అదే కోయిన్సిడెన్స్​.

విషయంలోకి వెళ్తే జనవరి 12న విడుదల కానున్న 'గుంటూరు కారం' మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్​లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్​ను సాలిడ్​ రేంజ్​లో ఆక్యుపై చేస్తూ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ డే నెంబర్స్​ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి రెండు సాంగ్స్​లో ఒకటి మాస్ ఇంకొకటి మెలోడీ. ఫస్ట్ సాంగ్​ 'దమ్ మసాలా' నవంబర్ 7న విడుదలైంది. రెండో పాట 'ఓ మై బేబీ' డిసెంబర్ 13న ఆడియెన్స్​ ముందుకు వచ్చింది.

అయితే గతంలో ఇదే డేట్స్​కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అజ్ఞాతవాసి' సినిమాలోని పాటలు కూడా రిలీజ్ అవ్వడం కోయిన్సిడెన్స్​. అజ్ఞాతవాసి నుంచి మొదటి పాట 'బయటకొచ్చి చూస్తే' నవంబర్ 7నే విడుదల అయింది. రెండో పాట 'గాలి వాలుగా' డిసెంబర్ 12న విడుదల అయినప్పటికీ ఈ సాంగ్​ను పవన్ కళ్యాణ్ కోసం అనిరుధ్ స్పెషల్​గా ట్రిబ్యూట్ వీడియో చేసి డిసెంబర్ 13నే రిలీజ్ చేశారు. ఆ తర్వాత 'అజ్ఞాతవాసి' ట్రైలర్ జనవరి 6న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్​ పోన్ అయి జనవరి 7న బయటకు వచ్చింది. ఇప్పుడేమో గుంటూరు కారం ట్రైలర్ కూడా జనవరి 6న జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో విడుదల కావాల్సింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ట్రైలర్ నేడు(జనవరి 7) రిలీజ్ అవుతోంది.

ఇలా ప్రతి విషయంలో అజ్ఞాతవాసి సినిమాకు జరిగినట్లే గుంటూరు కారం సినిమాకు జరగడం ఇప్పుడు ఫ్యాన్స్​కు కలవరపెడుతోంది. అసలే అప్పుడు అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్​ టాక్​ను మూటగట్టుకుంది. అందుకే గుంటూరు కారం రిజల్ట్​ విషయంలో కాస్త టెన్షన్​ పడుతున్నారు. అలాగే హిట్ పక్కా అన్న ధీమాలోనూ ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అప్పుడే ధైర్యం వచ్చింది, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను - మహేశ్ బాబు

మహేశ్​ కోసం ఇండోనేషియన్ బ్యూటీ - RRR ఒలీవియాకు పోటీగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.