ETV Bharat / entertainment

మాధవన్​ కుమారుడి ఘనత.. డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​లో సిల్వర్ - madhavan son medal

స్టార్​ హీరో మాధవన్​ కుమారుడు వేదాంత్​ ప్రపంచ వేదికపై సత్తా చాటాడు. కోపెన్‌హాగన్​లో జరిగిన డానిష్​ ఓపెన్ స్విమ్మింగ్​​ ఈవెంట్​లో సిల్వర్​ మెడల్​ను సాధించాడు. దీంతో మాధవన్​ పుత్రోత్సాహంలో ముగినిపోయారు. అలాగే ఇదే ఈవెంట్​లో మరో విభాగంలో సాజన్​ ప్రకాశ్​ గోల్డ్​ గెలుచుకున్నాడు.

Madhavan's son
మాధవన్ కుమారుడు వేదాంత్
author img

By

Published : Apr 16, 2022, 3:38 PM IST

Updated : Apr 16, 2022, 10:38 PM IST

స్టార్ హీరో మాధవన్ కుమారుడు వేదాంత్​ మాధవన్ స్విమ్మింగ్​లో రాణిస్తున్నాడు. మరోసారి దేశం గర్వపడేలా చేశాడు. డెన్మార్క్​లోని కోపెన్‌హాగన్​లో జరిగిన డానిష్​ ఓపెన్​ స్విమ్మింగ్​ పోటీల్లో సత్తా చాటి.. సిల్వర్​ మెడల్​ను సాధించాడు. ఇదే ఈవెంట్​లో మరో విభాగంలో సాజన్​ ప్రకాశ్​ గోల్డ్​ గెలుచుకున్నాడు. దీంతో ఈ ఇద్దరు ఒలింపిక్స్​లో స్విమ్మింగ్​ విభాగంలో భారత్​కు ఆశాకిరణంగా మారారు.
కొడుకు సిల్వర్ మెడల్​​ గెలవడంపై మాధవన్ ఉబ్బితబ్బిబైపోతున్నారు. పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు. ఈ ఘనత సాధించడానికి తోడ్పాటు అందించిన స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఇన్​స్టా వేదికగా ధన్యవాదాలు తెలిపారు మాధవన్​. తన కొడుకు పతకం అందుకుంటున్న వీడియోను ఈ సందర్భంగా షేర్​ చేశారు.
"కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్‌లో వేదాంత్ భారత్​కు రజితాన్ని అందించాడు. ప్రదీప్ సార్, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు. మేం చాలా గర్వపడుతున్నాం."
- మాధవన్​, నటుడు
మాధనవ్​ ఇన్​స్టాల్​లో పోస్ట్​ను షేర్​ చేసిన కొద్ది క్షణాలకే వైరల్​గా మారింది. క్రీడాభిమానులు, సెలబ్రిటీలు, మాధవన్​ అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. నటి శిల్పా శెట్టి, ఆమె సోదరి షమితా శెట్టి.. ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

అయితే మాధనవ్​ కుమారుడు వేదాంత్​ స్విమ్మింగ్‌లో పోటీల్లో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది బెంగళూరులో జరిగిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. అంతకుముందు జరిగిన లాట్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్‌లో వేదాంత్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్​లో పతకం సాధించడమే లక్ష్యంగా వేదాంత్​ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇదీ చదవండి: ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు: ఆలియా

Last Updated : Apr 16, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.