ETV Bharat / entertainment

రిలీజ్​కు ముందే రూ.400 కోట్ల బిజినెస్.. 'లియో' లెక్కలు చూస్తే మతి పోవాల్సిందే!

తమిళ నటుడు విజయ్ నటిస్తున్న లియో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 26, 2023, 9:47 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా లియో. ఈ మూవీకి స్టార్ దర్శకుడు లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విక్రమ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లోకేశ్​.. ఈ సినిమాతో ఒక కొత్త యూనివర్స్​ను క్రియేట్ చేశారు. దీంతో లోకేశ్​ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విజయ్​తో తీస్తున్న లియో మూవీ కూడా లోకేశ్​ యూనివర్స్​లో భాగమే అని ప్రచారం రావడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠ పెరిగింది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే రికార్డు వసూళ్లు సాధించిన తొలి సినిమా గా లియో వార్తల్లోకెక్కుతోంది. ఈ సినిమాను డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ హక్కులను కొన్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం.

ఇప్పటికే ఎల్సీయూలో ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. విక్రమ్ సినిమాతో లోకేశ్​ యూనివర్స్​లో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చివర్లో రోలెక్స్ క్యారెక్టర్ ఎండింగ్​తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ లియో మూవీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా విడుదలకు ముందే రూ.400 కోట్లు సాధించిన తొలి సినిమాగా లియో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా అక్టోబర్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.