ETV Bharat / entertainment

కేజీఎఫ్- 2 రూ.400 కోట్లు.. సందీప్ కిషన్ పాన్ఇండియా చిత్రం - కేజీఎఫ్ కలెక్షన్

KGF 2 collections: పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన కేజీఎఫ్-2 చిత్రం రికార్డులు కొల్లగొడుతోంది. హిందీ వెర్షన్​లో రూ.400 కోట్ల కలెక్షన్ రాబట్టింది. మరోవైపు, సందీప్ కిషన్ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం ఓపెనింగ్స్​లో రికార్డు సృష్టించింది.

kgf 2 400 crores
kgf 2 400 crores
author img

By

Published : May 7, 2022, 1:50 PM IST

Updated : May 7, 2022, 10:38 PM IST

KGF 2 400 crores in Hindi: ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్​ నటించిన చిత్రం 'కేజీయఫ్‌-2'. ఈ సినిమా సాధించిన విజయంతో యశ్ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. రాఖీభాయ్‌గా స్టైల్‌, యాక్షన్‌తో అద్భుతంగా డైలాగ్స్‌ చెప్పి సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఏప్రిల్​ 14న విడుదలైన ఈ మూవీ తొలి రోజు నుంచే సూపర్​హిట్​ టాక్​తో దూసుకెళ్తూ ఇంకా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. బాలీవుడ్​లో అయితే హిందీ సినిమాలకు కూడా సాధ్యం కాని.. వసూళ్లను రాబడుతోంది. తాజాగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్​లో శుక్రవారం రూ.3.85 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా.. రూ.401.80 కోట్లను వెనకేసుకుంది.

KGF 2 400 crores in hindi
కేజీఎఫ్-2లో యశ్

Sandeep Kishan pan India: విజయ్ సేతుపతితో కలిసి సందీప్ కిషన్ ఓ పాన్ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మైఖెల్ అనే పేరును ఖరారు చేశారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్​ లుక్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సైతం ఈ సినిమాలో కీ రోల్ చేయనున్నారు. రంజిత్ జెయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Sandeep Kishan pan India
సందీప్ కిషన్ మైఖెల్ ఫస్ట్ లుక్

Dr Strange 1st day collection: మార్వెల్ నుంచి వచ్చిన 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్​నెస్' చిత్రం ఇండియాలో దూసుకెళ్తోంది. అవేంజర్స్ ఎండ్​గేమ్, స్పైడర్ మ్యాన్, అవేంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రాల తర్వాత ఇండియాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు కెక్కింది. డాక్టర్ స్ట్రేంజ్​కు ఇండియాలో విడుదలైన అన్ని వెర్షన్​లలో కలిపి రూ.27.50కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

అలాగే ఏఐ ఆనంద్​ దర్శకత్వంలో సందీప్​ చేస్తున్న సినిమా పేరును ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాకు 'ఊరి పేరు బైరవకోన' అనే టైటిల్​ను ఖరారు చేశారు.

dr strange
డా. స్ట్రేంజ్ చిత్రం.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసిన ఫొటో

ఇదీ చదవండి:

మహేశ్​ బాబు ఇంటిని చూశారా? మోడ్రన్ ఇంద్ర భవనమే!

ఖరీదైన చీరలో కంగన హొయలు.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Last Updated : May 7, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.