బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ తన వివాహ బంధంలో మునిగితేలుతున్నారు. విరామం దొరుకుతే చాలు.. భర్త విక్కీ కౌశల్‌తో కలిసి సరదా సరదాగా గడుపుతుంటారు. అలా గడిపిన ఫొటోలను ఇటీవల కత్రినా షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. అయితే తాజాగా కత్రినా కైఫ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ.. నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
తాజాగా కత్రినా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన లుక్.. సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల కత్రినా ప్రెగ్నెంట్‌లాగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. పెళ్లైన నాలుగు నెలలకే కత్రినా ప్రెగ్నెంట్ అయ్యారంటూ చలోక్తులు విసురుతున్నారు.
నటి కత్రినా కైఫ్.. తన సహ నటుడు విక్కీ కౌశల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏ విషయమైనా ఈజీగా బయటికి వచ్చే బాలీవుడ్‌లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి జరిగే వరకు బయటికి రాలేదు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. పెళ్లి అయినప్పటి నుంచి.. వీరి పర్సనల్ లైఫ్‌లోని చిన్న చిన్న ఆనందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కపుల్ గోల్స్‌ను సెట్ చేస్తున్నారు.