ETV Bharat / entertainment

తిట్టడం కోసమే నా షో చూస్తున్నారు, అయినా నాకు ఆనందమే - కరణ్​ జోహార్​ న్యూస్

Karan johar on koffee with karan కాఫీ విత్​ కరణ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆ షో హోస్ట్ కరణ్​ జోహార్​. తన షోను తిట్టుకునేవాళ్లే ఎక్కువగా చూస్తారని చెప్పారు. వాళ్లు కేవలం తిట్టడం కోసమే నా షో చూస్తున్నారని తెలిసిందన్నారు.

Karan johar on koffee with karan
Karan johar on koffee with karan
author img

By

Published : Aug 24, 2022, 10:35 PM IST

Karan johar on koffee with karan: డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమయ్యే కాఫీ విత్‌ కరణ్‌ షోను వీక్షించే అభిమానుల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా 2004లో ప్రారంభమైన ఈ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం 7వ సీజన్​లో నడుస్తోంది. సినిమాల పరంగా కరణ్‌ జోహార్‌ ఎంత పాపులర్‌ అయ్యారో, ఈ షో ద్వారా అంతే ప్రాముఖ్యత సంపాదించారంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఈ షోను అభిమానించే వారితో పాటు, విమర్శించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. గత కొన్నేళ్లుగా ఈ షోలో ద్వంద్వార్థాలతో పాటు, అంతరంగిక విషయాల ప్రస్తావన ఎక్కువగా వస్తుండటంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా కాఫీ విత్‌ కరణ్‌ షో ని విమర్శకులు ట్రోల్‌ చేస్తున్నారు.

కరణ్‌ అతని షోకి వచ్చే బాలీవుడ్‌ సెలెబ్రిటీలపై నెట్టింట ఛలోక్తులు పేలుస్తున్నారు. కాఫీ విత్ కరణ్​కు అడల్ట్‌ షోగా ట్యాగ్‌లైన్‌ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్‌ జోహార్‌ మాట్లాడుతూ.. 'నా షోపై కొందరు చేస్తున్న విమర్శలకు నేను సమాధానం చెప్పి తీరాలి. ఇటీవల కొందరు సోషల్‌ మీడియాలో నా షో ని తిడుతూ చేసిన రీల్స్‌ ని చూసి నేను ఆశ్చర్యపోయాను. కేవలం వినోదం కోసమే నా షో ఇన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. అయితే నా షో పట్ల ద్వేషం చూపించేవాళ్లు ఉన్నారని తెలిసి నేను షాక్‌ అయ్యాను. వాళ్లు కేవలం తిట్టడం కోసమే నా షో చూస్తున్నారని తెలిసింది. వాళ్ల సమయాన్ని నా కోసం కేటాయిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని అన్నారు. ప్రస్తుతం ఈ షోలో షాహిద్‌ కపూర్, కియారా అడ్వానీ పాల్గొన్న ఎనిమిదో ఎపిసోడ్‌ ఆగస్టు 25న విడుదల కానుంది.

ఇవీ చదవండి: ఈ బుల్లితెర హీరోయిన్​ను చూస్తే నిశా ఎక్కాల్సిందే

ఇకపై నేనే సూపర్ స్టార్, షారుక్ అభిప్రాయం తప్పు, రౌడీ హీరో పవర్ పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.