ETV Bharat / entertainment

'విక్రమ్'​ టు 'కాంతారా'.. ఈ థీమ్ సాంగ్స్​ సూపర్​ హిట్​.. మీరు విన్నారా? - super hit theme songs

ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు సంబంధించిన థీమ్​ సాంగ్స్ సూపర్​హిట్​గా నిలిచాయి. శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్​మీడియాలో బాగా దూసుకెళ్తున్నాయి. అవేంటంటే..

vikram to Kantara theme songs
విక్రమ్​ టు కాంతారా థీమ్ సాంగ్స్​
author img

By

Published : Oct 25, 2022, 11:46 AM IST

ఓ సినిమా హిట్​ విషయంలో పాటలు, డ్యాన్స్​లు, ఫైట్స్​ ఇలా ఎన్నో అంశాలు కీలకం. అయితే ఈ సాంగ్స్​ విషయానికొస్తే రెండు రకాలు ఉంటాయి. కథలో భాగంగా వచ్చే పాటలు. కథను వివరించే పాటలు. ఈ రెండో రకాన్ని థీమ్​ సాంగ్స్​ అని అంటాం. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాల్లో ఈ థీమ్స్​ సాంగ్స్​ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. సోషల్​మీడియా ప్లాట్​ఫామ్స్​లోనూ అత్యధిక వ్యూస్​, లైక్స్​తో దూసుకెళ్లాయి. మరి ఆ పాటలేంటి? అవి ఏ సినిమా కథను తెలియజేస్తున్నాయి? తెలుసుకుందాం..

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ సృష్టించిన సినిమాటిక్‌ యూనివర్స్‌ 'విక్రమ్‌'. ఇందులో కమల్‌.. కర్ణన్‌ అనే పాత్ర పోషించారు. చనిపోయిందనుకున్న ఆ పాత్ర తిరిగివచ్చే సన్నివేశం సినిమాకే కీలకం. ఆ కథాంశానికి తగ్గట్టే టైటిల్‌ ట్రాక్‌ ఉంటుంది. 'కాలమే కంపించినా మళ్లీ వచ్చెను నాయకుడు.. ఒక్కడే ఇద్దరు కదా రాముడూ రాక్షసుడు' అనే ఈ పాటకు థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ మంచి ఆదరణ దక్కింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ రూపొందించిన చిత్రం 'బింబిసార'. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో కల్యాణ్‌రామ్‌.. బింబిసారుడు, దేవదత్తుడుగా నటించారు. వర్తమాన పాత్ర దేవదత్తుడు పరిచయ సన్నివేశాన్ని ఓ ర్యాప్‌ సాంగ్‌తో తీర్చిదిద్దారు. ఇందులో బింబిసారుడి వీరత్వం గురించీ ఉంటుంది.

కృష్ణతత్వం కథాంశంతో యువ హీరో నిఖిల్‌- దర్శకుడు చందు మొండేటి కాంబోలో వచ్చిన చిత్రం 'కార్తికేయ 2'. ఇందులో 'హే మాధవ.. హే కేశవ' అంటూ సాగే పాట అటు కృష్ణుడి గురించి చెబుతూనే 'ప్రశ్నకు సమాధానం లభించే వరకూ హీరో పోరాడతానే ఉంటాడు' అనే అంశాన్ని స్పృశిస్తుంది.

కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార' ఇటీవలే అన్ని భాషల్లో విడుదలై మంచి బాక్సాఫీస్​ ముందు రికార్డులు సృష్టించింది. ఓ గూడెం నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో విష్ణుమూర్తిగా (వరాహ రూపంలో) కనిపించే సన్నివేశం, 'వరాహ రూపం దైవ వరిష్ఠం' పాట సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమా థీమ్‌.. కర్ణాటక తుళునాడులోని భూతకోల సంస్కృతిని తెలియజేస్తుంది.

ఇదీ చూడండి: చరణ్​​​-బన్నీ​ మల్టీస్టారర్​ ప్రాజెక్ట్​.. ఆ దర్శకుడితో అల్లుఅరవింద్ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.