కన్నడ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటి చేతనా రాజ్ 21 ఏళ్లకే మృతి చెందారు. ఆమె మరణ పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఈ నెల 16న ఆమె బెంగళూరులోని ఓ కాస్మోటిక్ ఆస్పత్రిలో ఫ్యాట్ ఫ్రీ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ అయిన కొన్ని గంటలకు ఆమె ఊపిరితిత్తుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పరిస్థితి వికటించి.. మృతి చెందినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తన కూతురు మృతి చెందిందని చేతన తండ్రి గోవింద్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ఐసీయూ సరిగా లేదని.. శస్త్రచికిత్స గురించి తమకు చెప్పలేదన్నారు.
గీత, దొరసాని, ఒలవిన్ నిల్దాన్ వంటి కన్నడ సీరియల్స్‌తో చాలా పాపులర్ అయ్యింది చేతనా రాజ్. అలాగే 'హవయామి' సినిమాలో కూడా ఆమె నటించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు.
ఇదీ చదవండి: బాలీవుడ్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్న మరో 7 తెలుగు సినిమాలు