ETV Bharat / entertainment

'టాలీవుడ్​లో వారంతా నా స్నేహితులే... బాలకృష్ణతో కలిసి సినిమా..!' - శివ రాజ్​ కుమార్ స్పెషల్​ ఇంటర్వ్యూ

"వినోదం, యాక్షన్‌తో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం 'వేద'. ఇది కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది" అన్నారు శివ రాజ్‌కుమార్‌. రాజ్‌కుమార్‌ నట వారసుడిగా తెరపైకి కాలుమోపి.. ఐదు దశాబ్దాలుగా కన్నడ ప్రేక్షకులతో పాటు భారతీయ సినీప్రియుల్ని అలరిస్తున్న కథానాయకుడాయన. ఇప్పుడు 'వేద'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇది ఆయనకు 125వ చిత్రం. హర్ష తెరకెక్కించారు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శివ రాజ్‌కుమార్‌.

Shiva Raj kumar
Shiva Raj kumar
author img

By

Published : Feb 9, 2023, 6:49 AM IST

కన్నడ స్టార్​ నటించిన రీసెంట్​ హిట్​ మూవీ వేదా. కన్నడలో హిట్​ కొట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 9న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శివ రాజ్​ కుమార్ విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం..
తెలుగు చిత్రపరిశ్రమ, ప్రేక్షకులతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
"నాకు ఈ పరిశ్రమతో.. ఇక్కడి ప్రేక్షకులతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన నా 'కిల్లింగ్‌ వీరప్పన్‌'తో పాటు మరికొన్ని సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అలాగే బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో నటించా. రామోజీ ఫిల్మ్‌ సిటీ కట్టాక అందులో చిత్రీకరణ జరుపుకున్న తొలి కన్నడ చిత్రం నాదే. ఇక్కడి 'ఉలవచారు బిర్యానీ' అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్‌.. ఇలా నాకెంతో మంది మంచి స్నేహితులున్నారు. వాళ్లు నన్నెంతో ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడీ 'వేద'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది".

ఈ 'వేద' కథేంటి? మీ పాత్ర ఎలా ఉండనుంది?
"మంచి సందేశంతో కూడిన పక్కా వాణిజ్య చిత్రమిది. కుటుంబంలో సమస్యలొచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలనేది ఈ సినిమాలో చూపించాం. ప్రేమ, జీవితం, సంతోషం, నమ్మకం.. ఈ నాలుగంశాలేే వేద జీవితంలో కనిపిస్తాయి. కుటుంబ ప్రేక్షకులకు ఈ కథతో చక్కగా కనెక్ట్‌ అవుతారు."

ట్రైలర్‌ చూస్తుంటే.. సినిమాలో యాక్షన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది..
"ఇదేమీ పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రం కాదు. ఇందులో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలున్నాయి. ఈ చిత్రంలో ఆడవాళ్లు ఫైట్స్‌ చేస్తారు. అదెందుకనేది తెరపై చూసినప్పుడు అర్థమవుతుంది. సమాజంలో ఆడవాళ్లు ఎప్పట్నుంచో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లు బలంగా నిలబడాలి. వారిని మనం ప్రోత్సహించాలి. ఈ అంశాలన్నింటినీ దీంట్లో చర్చించాం."

ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఎందుకలా?
"ఎంతో ఆసక్తికరమైన పాత్రలొస్తున్నాయి. అందుకే చేస్తున్నా. రజనీకాంత్‌ సినిమాలో నటించే అవకాశమొచ్చిందంటే ఎవరైనా కాదంటారా. అందుకే 'జైలర్‌'లో అతిథి పాత్ర చేస్తున్నా. అది చిన్న పాత్రైనా చాలా బాగుంటుంది. నాకు ధనుష్‌ అంటే ఇష్టం. తన 'కెప్టెన్‌ మిల్లర్‌' చిత్రంలో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే అది చేస్తున్నా. తెలుగులోనూ రెండు మూడు కథలు విన్నా. ఏదీ ఖరారు కాలేదు. బాలకృష్ణ కూడా మనిద్దరం కలిసి చేద్దామన్నారు. చూద్దాం ఏమవుతుందో".

ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేశారు. ఇంకా ఏమైనా డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయా?
"'అన్నమయ్య' తరహా భక్తి ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను 'అశ్వథామ', 'ఘోస్ట్‌', '45', 'కరటక ధమనక' తదితర చిత్రాలు చేస్తున్నా".

రెండేళ్లుగా కన్నడ చిత్రసీమ ఎంతో ఖ్యాతి సాధించుకుంది. మీకెలా అనిపిస్తోంది?
"కన్నడ, తెలుగు.. రెండు చిత్రసీమలూ మంచి స్థాయికి వెళ్లాయి. చాలా సంతోషంగా ఉంది. పక్కా ప్రణాళికలతోనే ఇక్కడ ఇంత మంచి సినిమాలు చేయగలుగుతున్నారు. ఇలా గట్టిగా ప్రయత్నించినప్పుడే లక్ష్యాలు చేరుకోగలుగుతాం. నా దృష్టిలో పాన్‌ ఇండియా స్టార్‌ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను తెలుగులోనూ మాట్లాడుతాను కానీ, అంత అనర్గళంగా రాదు. కాస్త సమయం తీసుకొని పర్‌ఫెక్ట్‌గా మాట్లాడాలి అనుకుంటున్నా".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.