ETV Bharat / entertainment

అంతర్జాతీయ స్టంట్​ టీమ్​తో 'భారతీయుడు 2' ఫైట్స్​.. రిలీజ్​​ అప్పుడేనా..? - భారతీయుడు 2 కోసం ఇంటర్నేషనల్​ స్టంట్​ టీమ్​

90లో రిలీజై సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమా 'భారతీయుడు'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్​ తెరకెక్కేంచే పనిలో ఉన్నారు దర్శకుడు శంకర్​. ఇప్పటికే శరవేగంగా జరుగుతున్న షూటింగ్​ గురించి ఓ తాజా అప్డేట్​ నెట్టింట వైరలవుతోంది. అదేంటంటే..

bharateeyudu 2
international sunt team for bharateeyudu 2
author img

By

Published : Mar 10, 2023, 10:27 AM IST

గతేడాది విడుదలైన 'విక్రమ్​' సినిమాతో ప్రేక్షకులను అలరించారు లోకనాయకుడు కమల్ హాసన్​. ఇక కమల్​హాసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన యాక్షన్​తో ఇరగదీసి అందరి మైండ్​ బ్లాంక్​ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా ప్రశంసలు కూడా అందుకుంది. అయితే 'విక్రమ్‌' సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న లోకనాయకుడు కమల్​ హాసన్​ ..ఈ సినిమా తర్వాత మరింత జోరు పెంచారు.

ప్రస్తుతం ఆయన దృష్టంతా తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'భారతీయుడు 2' పైనే ఉంది. ప్రముఖ డైరెక్టర్​ శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొంత కాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికే పలు మార్లు షూటింగ్​ వాయిదా పడింది. అయినప్పటికీ డైరెక్టర్​ శంకర్​ మాత్రం ఈ సినిమాను ఎలాంటి అడ్డంకులు లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్​ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నారట.

kamal hassa with stunt team
మూవీ టీమ్​తో కమల్​ హాసన్​

గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్​ చెన్నైలో జరుగుతోంది. ఇందులో భాగంగా.. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్‌ సీన్స్​ను అక్కడే తెరకెక్కిస్తున్నారట. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయి నుంచి యాక్షన్‌ కొరియోగ్రాఫర్లును సైతం తెప్పించారట డైరెక్టర్​ శంకర్​. తాజాగా కమల్​ హాసన్​ వారితో షూట్​ సమయంలో మచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్​ అవుతోంది. మరోవైపు ఈ లాంగ్​ షెడ్యూల్​లో పాల్గొనేందుకు అందాల తార కాజల్ అగర్వాల్​ కూడా ఇటీవలే సెట్స్​లోకి అడుగుపెట్టింది.​

రిలీజ్​ డేట్​ అప్పుడే..
మరోవైపు 'ఆర్​సీ 15' షూటింగ్​తో పాటు 'భారతీయుడు 2' సినిమాలతో టైట్​ షెడ్యూల్​ గడుపుతున్నారు దర్శకుడు శంకర్​. అయితే ఆయన ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ క్రమంలో 'భారతీయుడు2' సినిమాను ఈ ఏడాది దీపావళి కల్లా థియేటర్లలో రిలీజ్​ చేసేందుకు సిద్ధం చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ వినిపిస్తోంది.

భారీ బడ్జెట్​తో అప్పటి సూపర్​ హిట్​ సినిమా 'భారతీయుడు'కి సీక్వెల్​గా తెరకెక్కుతున్న 'భారతీయుడు 2 ' సినిమాలో లోకనాయకుడు కమల్​ హాసన్​తో పాటు కాజల్​, రకుల్​ ప్రీత్​ సింగ్​ నటిస్తున్నారు. అంతే కాకుండా సముద్రఖని, ప్రియ భవానీ శంకర్‌, బాబీ సింహా, వెన్నెల కిషోర్‌ లాంటి స్టార్స్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్​ రవిచందర్ బాణీలు కట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.