ETV Bharat / entertainment

వెకేషన్​ ప్లాన్​ చేసిన ఎన్టీఆర్​..​ ఫ్యామిలీతో ఫారిన్​ ట్రిప్​ - ఎన్టీఆర్ దేవర సిినిమా హీరోయిన్

Jr NTR Vacation With Family : సినిమా తారలు నిరంతర షూటింగ్​లతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంటారు. అప్పుడప్పుడు కుటుంబంతో గడపాలన్నా.. షెడ్యుల్ వేసుకొని మరీ సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుంది. అందుకే ఎక్కువగా వెకేషన్స్ అంటూ హాలీడే ట్రిప్​లు ప్లాన్​ చేసుకుంటారు.​ అయితే ఇప్పుడు జూనియర్​ ఎన్టీఅర్ కూడా ఆయన కుటుంబంతో వెకేషన్​ ప్లాన్​ చేశారు.

Jr NTR Vacation With Family
జూ ఎన్టీఆర్ హాలీడే ట్రిప్
author img

By

Published : May 29, 2023, 10:33 AM IST

Updated : May 29, 2023, 11:47 AM IST

Jr NTR Vacation With Family : ఈ మధ్య మన సినీతారలు సినిమా షూటింగ్​ల నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా కాస్త విశ్రాంతి కోసం.. హాలీడే వెకేషన్ అంటూ కుటుంబాలతో విదేశాలకు వెళ్తున్నారు. ఈ జాబితాలో అందరికంటే ముందుగా సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఉంటారు. ఇప్పటికే చాలా సార్లు భార్య నమ్రతా, పిల్లలు సితారా, గౌతమ్​లతో కలిసి ఫారిన్ వీధుల్లో సందడి చేశారు మహేశ్​. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో వైరల్ అయ్యాయి.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఅర్ కూడా కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్​లతో కసిలి ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఏ దేశం వెళ్తున్నారనేదాని పైన క్లారిటీ రాలేదు. సినిమా బిజీ షెడ్యుల్ నుంచి చిన్న విరామం తీసుకొని హాలీడే ట్రిప్​కు వెళ్లిన ఎన్టీఆర్ వారం రోజుల్లోనే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇటీవలే జూనియర్​ ఎన్టీఆర్​ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా గ్లోబల్ అవార్డ్స్​ కోసం అమెరికా వెళ్లారు.

Devara Movie NTR: సినిమా షూటింగ్​ నుంచి బ్రేక్​ తీసుకున్న జానియర్​ ఎన్టీఆర్ ఆదివారం.. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఅర్​ ఘాట్​ వద్ద నివాళి అర్పించారు. తారక్ వెకేషన్ నుంచి హైదరాబాద్​ తిరికి వచ్చాక 'దేవర' రెగ్యులర్​ షూటింగ్​లో పాల్గొంటారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా టైటిల్ అనౌన్స్​మెంట్​తో పాటు ఎన్టీఆర్ పోస్టర్​ను రిలీజ్​ చేసింది చిత్ర యూనిట్.
Devara Movie Cast : అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ 'దేవర'తో తెలుగులో అరంగేట్రం చేయనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. సైఫ్​ అలీ ఖాన్​పై ఇప్పటికే కొన్ని సన్నివేశాలు చిత్రించినట్లు సమాచారం. సైఫ్ రాకతో 'దేవర' పై అంచనాలు మరింత పెరిగాయి.

NTR Koratala Shiva Movie : 'ఆర్ఆర్​ఆర్'​ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్​ ఇండియా రేంజ్​లో స్టార్​డమ్ సాధించి.. తన మార్కెట్​ను పెంచుకున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్​లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా బ్లాక్​ బస్టర్​గా నిలిచి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్​లో 'దేవర' రానుంది. తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌, యువసుధ ఆర్ట్స్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్​పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Last Updated : May 29, 2023, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.