ETV Bharat / entertainment

ఆస్కార్ రేసులో తెలుగమ్మాయి.. అన్ని అడ్డంకులు దాటి ఆఖరికి.. - జాయ్​ ల్యాండ్​ సినిమా కథ

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో తెలుగమ్మాయి నిలిచింది. జాయ్​ ల్యాండ్​ అనే చిత్రంతో బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ క్యాటగిరీలో షార్ట్​ లిస్ట్​ అయింది. ఆమె ఎవరంటే..

joy land film
joy land film
author img

By

Published : Dec 22, 2022, 10:11 PM IST

Updated : Dec 22, 2022, 10:54 PM IST

జాయ్​ ల్యాండ్​ ఇది ఒక పాకిస్థానీ సినిమా. ఆ దేశం నుంచి ఆస్కార్​ బరిలో ఉన్న మొదటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఆ దేశంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. తమ దేశ విలువలు అతీతంగా ఉందనే కారణంగా ఈ సినిమాను నిషేధించారు. అనంతరం సెలెబ్రిటీలు, ప్రజల నుంచి విమర్శలు రావడం వల్ల.. ఆ దేశ ప్రధాని షెహబాజ్​.. ఓ కమిటీ ఏర్పాటు చేసి నిషేధాన్ని ఎత్తేశారు. ఇలాంటి ఆటంకాలన్నీ దాటుకుని అకాడమీ అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడుతోంది. సొంత దేశంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా ఈ సినిమాను అంతర్జాతీయ సమాజం ఆదరించింది.

joy land film
జాయ్​ ల్యాండ్​
joy land film
జాయ్​ ల్యాండ్​

కాగా, ఈ చిత్రానికి తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మాతగా వ్యహరించడం విశేషం. అపూర్వ చరణ్ హైదరాబాద్‌లోనే పుట్టింది. అనంతరం ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. అపూర్వ దాదాపు 20కిపైగా లఘు చిత్రాలను నిర్మించింది. జాయ్​ ల్యాండ్​ కథ.. అపూర్వకు ఆమె స్నేహితుల ద్వారా తెలిసింది. అనంతరం కథ, కథనాలు నచ్చాయి. దీంతో ఈ సినిమా నిర్మించేందుకు ఒప్పుకుంది. జాయ్​ ల్యాండ్​ సినిమాను తొలిసారిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ సమయంలో స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుంది. అంతర్జాతీయంగా సత్తా చాటడం వల్ల పాకిస్థానీ ప్రభుత్వం అధికారికంగా ఆస్కార్స్‌కు పంపిచింది. దీంతో ఆస్కార్​ నామినేషన్​ జరిగే ప్రక్రియలో షార్ట్‌లిస్ట్ అయ్యింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్​ కేటగిరీలో పోటీపడుతోంది. ఈ కేటగిరిలోనే భారత్​కు చెందిన 'చెల్లో షో' చిత్రం కూడా పోటీపడుతోంది.

joy land film
జాయ్​ ల్యాండ్​

ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఒక ట్రాన్స్ జెండర్​తో ప్రేమలో పడితే ఏం జరింగింది.. ఆ తర్వాత పరిణామాలు గురించి జాయ్ ల్యాండ్ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు సైమ్ సాదిక్ దర్శకత్వం వహించారు. అలీ జునేజో, రస్తీ ఫరూక్, అలీనా ఖాన్, సర్వత్ గిలానీ, సల్మాన్ పీర్జాదా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నోబెల్​ అవార్డ్​ గ్రహీత మలాలా యూసఫ్​జాహీ ఎగ్జిక్యూటివ్​ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ఆస్కార్​కు షార్ట్​ లిస్ట్ కావడంపై ఆమె స్పందించారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Last Updated : Dec 22, 2022, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.