కామెడీ టైమింగ్, వైవిధ్యమైన హావాభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు రాకింగ్ రాకేశ్. అందుకే చాలా తక్కువ కాలంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్‌లో టీమ్‌లీడర్ స్థాయికి చేరుకున్నాడు. మరోవైపు జోర్దార్ సుజాతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సుజాత.. రాకేశ్ టీమ్ ద్వారా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్లో నవ్విస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ తమ స్కిట్లలో కడుపుబ్బా నవ్విస్తూనే లవ్‌ట్రాక్‌ను నడిపించారు. మొదట ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత నిజజీవితంలోనూ ప్రేమపక్షులుగా మారారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విషయాలు, వీడియోలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
దీంతో వీరిద్దరూ ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా సుజాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంది. తమ నిర్ణయాన్ని పెద్దలు గౌరవించి, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. రాకేశ్‌తో పరిచయం దగ్గర నుంచి స్నేహం, ప్రేమ, చివరికి పెళ్లి వరకు ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను వీడియోలో షేర్ చేసుకుంది. ఈ నెల చివర్లోనే తమ నిశ్చితార్థం ఉండనుందని, త్వరలోనే పెళ్లి డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొన్నిరోజుల క్రితం ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ తన ప్రేమ గురించి చెప్పాడు. "మాది నిజమైన ప్రేమే.. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తనకు జబర్దస్త్‌లో చేయాలని ఆసక్తి ఉందని తెలిసి.. అప్పటికే వేరే కామెడీ షోలో చేస్తున్న తనను ఇక్కడికి తీసుకొచ్చాను. తను జబర్దస్త్‌లోకి వచ్చేటప్పటికే బాగా ఫేమస్. ఇక్కడ కలిసి పనిచేస్తున్న క్రమంలో మా బంధం బలపడింది. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో తను అర్థం చేసుకోలదు. అంతకుమించిన అదృష్టం మరోటి లేదు. మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరికినప్పుడు తీసుకోకపోతే మళ్లీ రాదని నా అభిప్రాయం." అని అన్నాడు.
ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడిన సుజాత.. జబర్దస్త్‌లో తనకు ఫేం రావడానికి కారణం రాకేశే అని చెప్పింది. 'నాకు జబర్దస్త్‌లో చేయాలని ఉందని చెప్పినప్పుడు అందుకు సరే అన్నాడు. నేను బయట చేసే స్కిట్లలో ఎలాంటి తప్పులు చేస్తున్నాను, ఎలా చేయాలి వంటి మెళకువలు చెప్పాడు. అలా నేను ఇక్కడ నిలదొక్కుకోగలిగాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉండటానికి కారణం రాకేశే' అని చెప్పింది.