ETV Bharat / entertainment

'సినిమా ​కోసం డైరెక్టర్​కు రోజూ మెసేజ్​లు చేస్తున్నా' - Jhaanvi Kapoor Comments On NTR30 Movie And Jr NTR

ఎన్టీఆర్​ 30 సినిమా కోసం హీరోయిన్​గా జాన్వీ కపూర్​ను ఎంపిక చేయడంపై ఆమె తాజాగా స్పందించింది. ఎన్టీఆర్​తో స్క్రీన్​ షేర్​ చేసుకోవడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని పేర్కొంది. ఇంకా ఏమన్నదంటే..

Jhaanvi Kapoor Comments On NTR30 Movie And Junior NTR
ఎన్టీఆర్​30 సినిమా, ఎన్టీఆర్​పై జాన్వీ కపూర్​ కామెంట్స్​
author img

By

Published : Mar 19, 2023, 4:31 PM IST

ఎన్టీఆర్​30 సినిమాలో హీరోయిన్​గా అవకాశం రావడంపై బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్​ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. యంగ్​టైగర్​ ఎన్టీఆర్​తో కలిసి ఎన్టీఆర్​30 సినిమాలో నటించనున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందంటూ బాలీవుడ్​భామ జాన్వీ కపూర్​ చెప్పారు. సినిమా ఎప్పడు ప్రారంభమవుతుందా అని ఆశాగా ఎదురుచూస్తున్నా అని జాన్వీ అన్నారు. ఎన్టీఆర్​తో కలిసి స్క్రీన్​ షేర్​ చేసుకోవడం నటిగా తన జీవితంలో మర్చిపోలేనని తాజాగా ఓ ఛానల్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది జాన్వీ. జూ.ఎన్టీఆర్​తో నటించేందుకు తను చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ఆయనతో కలిసి నటించడం అనేది తన కల అని చెప్పింది జాన్వీ.

ఇక ఈ బాలీవుడ్​ భామ ఎన్టీఆర్​30 సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అరంగేట్రం చేయనున్నారు. కొరటాల శివ, జూ.ఎన్టీఆర్​ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా గనుక హిట్​ అయితే జాన్వీకి సినిమా ఆఫర్లు క్యూ కట్టనున్నాయి. తాజాగా ఈమె తన 26 ఏటలోకి అడుగు పెట్టారు. మార్చి 6న తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్​30 కి సంబంధించి ఫస్ట్​ పోస్టర్​ను తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు జాన్వీ. ఇక ఈ పోస్టర్​లో జాన్వీ కూల్​ లుక్​లో ఓ నదిఒడ్డున కూర్చొని ఉన్నట్లుగా కనిపిస్తున్న పోజ్​ అందరిని ఆకట్టుకుంటోంది. అంతేగాక చీరకట్టులో వదులు జుట్టుతో వెనక్కి తిరిగి చూస్తున్న జాన్వీ స్టిల్​ మతిపోయే విధంగా ఉందంటూ ఆమె ఫ్యాన్స్​ పొగుడ్తున్నారు.

"జూనియర్​ ఎన్టీఆర్​ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి నటించాలనేది నా కల. చివరకు ఆ కల నెరవేరే రోజు రానే వచ్చింది. ఇందుకోసం నేను రోజు దేవుడిని ప్రార్థించేదాన్ని. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్​పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇందుకోసం డైరెక్టర్​ శివ సర్​కు రోజూ మెసేజ్​లు చేస్తున్నా."- జాన్వీ కపూర్​

ఇక ఈ సినిమాని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్​ రవిచందర్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆర్​ రత్నవేలు కెమెరామెన్​, సాబు సిరిల్​ విజువల్​ ఎఫెక్ట్స్​ని పర్యవేక్షించనున్నారు. శ్రీకర్​ ప్రసాద్​ ఎడిటర్​గా వ్యవహరించనున్నారు. ఇకపోతే జాన్వీ తాజాగా బాలీవుడ్​ హీరో వరుణ్​ ధావన్​తో కలిసి బవాల్​ అనే హిందీ చిత్రంలో నటించింది. దీనిని దర్శకుడు నితేష్​ తివారీ రూపొందించారు. ఇక ఈ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతేడాది నవంబర్​ 4న హిందీలో విడుదలైన మిలిలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్​. 2019లో మలయాళంలో వచ్చిన హెలెన్​ సినిమాకు రీమేక్​గా దీన్ని రూపొందించారు. ఈ సినిమాని స్వయాన జాన్వీ తండ్రి బోనీ కపూర్​ నిర్మించారు. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఇందులో సన్నీ కౌశల్​, మనోజ్ పహ్వా, హస్లీన్​ కౌర్​ ప్రధాన పాత్రల పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.