ETV Bharat / entertainment

Jawan Twitter Review : షారుక్ 'జవాన్​' ఎలా ఉందంటే ? - జవాన్​ మూవీ రివ్యూ

Jawan Twitter Review : బాలీవుడ్ బాద్​షా షారుక్ నటింటిన 'జవాన్​' మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఇక ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన ఆడియెన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

Jawan Twitter Review
Jawan Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 7:26 AM IST

Updated : Sep 7, 2023, 8:53 AM IST

Jawan Twitter Review : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన యాక్షన్​ థ్రిల్లర్​ మూవీ 'జవాన్​'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజైంది. సినిమా రిలీజ్​కు ముందే థియేటర్ల వద్ద బారులు తీరిన అభిమానులు.. షారుక్ కటౌట్ల వద్ద డ్యాన్స్​ చేస్తూ సందడి చేశారు. దీంతో రిలీజైన అన్ని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్​ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్​ వేదికగా షేర్​ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

  • I have never seen this kind of craze for any movie star 💥⚡
    Amazing, Unbelievable 💥🥳
    Mass celebration is going on everywhere 🚩#Jawan pic.twitter.com/sMgTnpGpQa

    — 𝐁𝐚𝐛𝐚 𝐘𝐚𝐠𝐚 (@yagaa__) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం 'జవాన్'​కు పాజిటివ్​ టాక్​ వస్తోంది. ఈ సినిమాలో షారుక్​ మాస్ ఎంట్రీ అదిరిపోయిందని.. సినిమా యాక్షన్ ప్యాక్డ్​గా ఉందని.. ఇది కచ్చితంగా హిట్ సినిమా అంటూ ఓ నెటిజన్​ కామెంట్​ చేశారు. ఇక జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ ఇంకొకరు అభిప్రాయపడగా.. మాస్ అవతార్‌లో ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సినిమా అంటే ఎలా ఉంటుందో అలా చూపించారు అంటూ మరో అభిమాని రాసుకొచ్చారు.

  • #JawanReview :⭐⭐⭐⭐#Jawan is a fascinating crime filled movie told from multiple perspectives with perfect pace & cinematography. An absolute entertainer package with action, comedy, thrill & what else.. @iamsrk @VijaySethuOffl & @Atlee_dir keep us on the edge of our seat.…

    — Box Office Page (@Boxofficepage) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Jawan : MEGABLOCKBUSTER.

    Rating: ⭐️⭐️⭐️⭐️½

    Jawan is a WINNER and more than lives up to the humongous hype… #Atlee immerses us into the world of Mass pan-Indian film, delivers a KING-SIZED ENTERTAINER…

    MUST, MUST, MUST WATCH. #JawanReview #ShahRukhKhan𓃵

    — SRK Raising 🍥 (@Raising407) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Jawan Twitter Review Telugu : "జవాన్ మూవీ ఓ విన్నర్. ఈ సినిమాపై పెరిగిన అంచనాల కంటే ఎక్కువగానే ఉంది. మాస్ పాన్ ఇండియా మూవీ అంటే ఎలా ఉండాలో అలాంటి సినిమాను అట్లీ ఇచ్చారు" అంటూ దర్శకుడికి ఓ అభిమాని కితాబివ్వగా.. కింగ్ సైజ్‌డ్ ఎంటర్‌టైనర్ సినిమాను అందించారు అంటూ మరో అభిమాని అట్లీని కొనియాడారు. జవాన్ తప్పకుండా చూడండి అంటూ నెట్టింట విజ్ఞప్తి చేశారు. మరొకరేమో ఇందులో నయనతార ఎంట్రీ బాగుందని.. విజయ్‌ సేతుపతి నటన అద్భుతమంటూ ట్వీట్​ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే... మొత్తానికి 'జవాన్‌' అందరినీ అలరిస్తుందంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు.

Jawaan Cast and Crew : ఈ సినిమాలో షారుక్​తో పాటు కోలీవుడ్​ లేడీ సూపర్​స్టార్​ నయనతార నటించారు. ఆమె ఓ ఇన్వెస్టిగేటివ్​ ఆఫీసర్ పాత్ర పోషించారు. మరోవైపు బాలీవుడ్‌ దివా​ దీపికా పదుకొణె, స్టార్​ హీరో సంజయ్‌ దత్‌ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్‌ రవిచందర్​ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. రాజా రాణీ ఫేమ్​ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై గౌరీ ఖాన్​ నిర్మించారు. సాంగ్స్​, హిందీ ప్రివ్యూ, ట్రైలర్​ ఇలా అన్నీ అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో రిలీజ్​కు ముందే అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Jawan SRK Role : 'జవాన్'​లో నా పాత్ర అలా ఉంటుంది... షారుక్​

Jawan Movie Interesting Facts : 'ఇన్నేళ్ల తర్వాత ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాను'

Last Updated : Sep 7, 2023, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.